Sukanya samriddhi yojana: సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీ రేట్లలో కీలక మార్పులు..
కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ది యోజన పథకం నియమాలు తాజాగా మారాయి. ఈ పథకం కింద పెట్టుబడి పెడితే..
Sukanya samriddhi yojana Scheme: కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ది యోజన పథకం నియమాలు తాజాగా మారాయి. ఈ పథకం కింద పెట్టుబడి పెడితే ఆడ పిల్లల భవిష్యత్తుకు అవసరమైన పూర్తి భరోసా అందివస్తుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం వడ్డీ రేట్లలో కీలక మార్పులు తీసుకొచ్చింది. అదేంటంటే.. సుకన్య సమృద్ది యోజన పథకం కింద మీ అమ్మాయి పేరు మీద రోజుకు రూ.416లు పొదుపు చేస్తే మీ అమ్మాయికి 21 ఏళ్లు వచ్చేటప్పటికీ ఆ డబ్బు రూ.65 లక్షలవుతాయి. పొదుపు చేసిన డబ్బుకు వచ్చే వడ్డీ ప్రతి ఆర్థిక సంవత్సరం చివర్లో ఖాతాలో క్రెడిట్ అయ్యే వెలుసుబాటు ఉంది. అంతేకాకుండా గతంలోనైతే మీ కుమార్తెకు పదేళ్ల వయస్సు వస్తేగానీ అకౌంట్‌లో డబ్బు తీయడానికి అవకాశం ఉండేది. ఐతే తాజా నిబంధనల ప్రకారం 18 యేళ్ల వరకు అకౌంట్‌ను కదిలించడానికి వీలులేదు. సుకన్య సమృద్ది యోజన పథకం కింద ఒక కుటుంబంలో ఇద్దరు కుమార్తెల ఖాతాలకు మాత్రమే ట్యాక్స్ మినహాయింపు ఉండేది. ప్రస్తుతం కొత్త నియమాల ప్రకారం తొలుత ఆడపిల్ల పుట్టిన తర్వాత రెండోసారి అమ్మాయిలు కవలలుగా పుడితే వారికి కూడా సుకన్య సమృద్ది యోజన పథకం కింద ఖాతా తెరచుకోవచ్చు. ఏడాదికి కనీసం రూ.250లు జమ చేయాలి. అలాచేయని పక్షంలో అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది. రెండోసారి యాక్టివ్ చేసుకోకపోతే అప్పటి వరకు ఖాతాలో జమ చేసిన మొత్తంపై మెచ్యూరిటీ పూర్తయ్యేంత వడ్డీ వస్తుంది.