కొల్లాత్తూర్ జనసంద్రమైంది. అభిమానుల కేరింతలు.. హర్షధ్వానాలు మిన్నంటాయి. అడుగడుగునా వెంట కదిలిన కార్యకర్తల సందోహం మధ్య నామినేషన్ దాఖలు చేశారు డీఎంకే అధినేత స్టాలిన్.
డీఎంకే అధినేత స్టాలిన్ నామినేషన్ వేశారు. ఆయన కొల్లాత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన స్టాలిన్‌కు ఘన స్వాగతం లభించింది. కొల్లాత్తూర్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు స్టాలిన్. నామినేషన్ ఘట్టానికి భారీగా తరలివచ్చారు కార్యకర్తలు. రోడ్‌షోలో కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు స్టాలిన్.
సోమవారం శుభముహూర్తం కావడంతో తమిళనాడులో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. సీఎం పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, మక్కల్ నీది మయ్యం నేత కమల్‌హాసన్, అమ్మ మక్కల్ మున్నేట్రకళగం నేత దినకరన్, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు శుక్రవారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
#WATCH | DMK president MK Stalin holds a roadshow in Kolathur after filing nomination for #TamilNaduElections2021 pic.twitter.com/nWS2rB4tjA
— ANI (@ANI) March 15, 2021
శని, ఆదివారాలు సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. ఇక సోమవారం.. అంటే ఈ రోజు ముహూర్తం బాగుండడంతో నేతలందరూ నామినేషన్ల దాఖలకు చేస్తున్నారు. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో కొన్ని సీట్లు మినహా మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఇందులో ఎడపాడిలో పళనిస్వామి, కొళత్తూరులో స్టాలిన్, కోయంబత్తూరు దక్షిణంలో కమలహాసన్, కోవిల్ పట్టిలో దినకరన్, తిరువొత్తియూరులో సీమాన్ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అనంతరం ఎన్నికల ప్రచార నగారను మోగించనున్నారు. మంత్రులు, ముఖ్య నేతలంతా ఇదే రోజు నామినేషన్లు దాఖలు చేయనుండడంతో ఆయా కార్యాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మరొకరిని కూడా రిటరి్నంగ్ అధికారుల వద్దకు అనుమతించనున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరించనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మీరు వడ్డీ లేకుండా రూ.10వేల వరకు తీసుకోవచ్చు…
Yadadri: వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి.. మరికాసేపట్లో విశ్వక్సేనుడి పూజ..
India vs England: అరంగేట్ర మ్యాచ్‌లోనే దంచికొట్టేశాడు.. కెప్టెన్ అండతో దుమ్ములేపాడు.. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ పవర్ చూపించాడు