కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు కోపమొచ్చింది. మాండ్యలో ఆస్పత్రి సందర్శనకు వెళ్లిన డీకే.. ఓ కార్యకర్త చెంప చెళ్లుమన్పించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత మద్దెగౌడను డీకే శివకుమార్ పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. తన భుజం మీద ఆ కార్యకర్త చెయ్యి వేసి ఫోటో తీసుకునేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు డీకే శివకుమార్. హద్దుమీరి ప్రవర్తించాడని , తనకు కనీస మర్యాద ఇవ్వలేదని ఆ కార్యకర్తపై మండిపడ్డాడు డీకే శివకుమార్. కార్యకర్తను డీకే చెంప మీద కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కార్యకర్తలంటే డీకే శివకుమార్‌కు చాలా చులకన అని విమర్శించారు బీజేపీ నేతలు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉండి.. ఇలా ప్రవర్తించడమని అనర్హమని పేర్కొన్నారు. శివకుమార్ ఇలాంటి ప్రవర్తనను వదులుకోలేకపోతే ప్రజా జీవితాన్ని వదులుకోవాలని బీజేపీ సూచించింది. అయితే భౌతికదూరం పాటించకపోవడంతోనే కార్యకర్తను మందలించినట్టు వివరించారు డీకే శివకుమార్. సదరు వీడియోను సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్ చేయవద్దని కోరారు. అయితే నెటిజన్లు మాత్రం తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కొనసాగిస్తున్నారు. కాగా గతంలో కూడా తనతో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించిన కార్యకర్తల ఫోన్లను విసిరికొట్టారు శివకుమార్.
Life of a Congress worker ?#Karnataka #DKShivakumar pic.twitter.com/kbfVhz4TPV
— Hindu Urjaa (@HinduUrjaa) July 10, 2021
Also Read: మోహన్ బాబుపై సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..