
School Holidays: అక్టోబర్ నెల సంవత్సరంలో అత్యంత పండుగలు, సెలవులతో నిండిన నెలల్లో ఒకటిగా మారుతోంది. విద్యార్థులకు సెప్టెంబర్‌లోనే భారీగా సెలవులు వచ్చాయి. ఇప్పుడు అక్టోబర్ నెల కొనసాగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా దసరా సెలవులు భారీగా వచ్చాయి. ఇప్పుడు దసరా పండగా ముగిసింది. దీవపావళి రాబోతోంది. ఇప్పుడు కూడా పాఠశాలలకు భారీగా సెలవులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సెలవుల కోసం ఆసక్తిగా ఎదురుచూసే పాఠశాల విద్యార్థులకు మరిన్ని సెలవు రానున్నాయి. దీంతో వారికి పండగే.. పండగ. ఈ నెల నవమి, దసరా సెలవులతో ప్రారంభమైంది. ఆ తర్వాత వాల్మీకి జయంతి సందర్భంగా అనేక రాష్ట్రాల్లో సెలవు ప్రకటించారు. కానీ సెలవుల పరంపర అక్కడితో ముగియదు. దీపావళి సమీపిస్తున్న కొద్దీ విద్యార్థులు పండుగ సెలవుల కోసం మళ్లీ ఎదురు చూస్తున్నారు.
ఇది కూడా చదవండి: Schools Timings: ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పాఠశాలల సమయ వేళల్లో మార్పులు!
ఈ సంవత్సరం దీపావళి పండుగ కేవలం ఒకటి లేదా రెండు రోజులు సెలవులు మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాల్లోని పాఠశాలల విద్యార్థులకు ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ కాలంలో అనేక పాఠశాలలు, కొన్ని కళాశాలలు కూడా మూసి ఉండనున్నాయి. దీనివల్ల విద్యార్థులు కుటుంబ సమయాన్ని, ఉత్సవాలను, విశ్రాంతిని ఆస్వాదించడానికి అవకాశం లభిస్తుంది.
2025 పండుగ క్యాలెండర్ ప్రకారం.. ధన్ తేరాస్ అక్టోబర్ 18న జరుపుకుంటారు. ఆ తర్వాత నరక చతుర్దశి (ఛోటీ దీపావళి), దీపావళి, గోవర్ధన పూజ, భాయ్ దూజ్ వరుసగా జరుగుతాయి. ఈ ఐదు రోజులు అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 23 వరకు విద్యార్థులకు నిరంతర పండుగగా ఉంటుంది. అక్టోబర్ 18న ధన్‌తేరాస్ జరుపుకుంటారు. ఇది ప్రభుత్వ సెలవుదినం కానప్పటికీ, సాధారణంగా నెలలో రెండవ శనివారం కారణంగా పాఠశాలలు మూసి ఉండే అవకాశం ఉంటుంది. అయితే అక్టోబర్ 19 నుండి అధికారిక సెలవులు ప్రారంభమవుతాయి. ఆదివారం సాధారణంగా దేశ వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది.
ఇది కూడా చదవండి: Jio Plan: 365 రోజుల చెల్లుబాటుతో చౌకైన ప్లాన్ జియో ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే!
అక్టోబర్ 20న నరక్ చతుర్దశి లేదా చోటి దీపావళి సందర్భంగా అనేక రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ఉంటుంది. ప్రధాన దీపావళి పండుగ అక్టోబర్ 21న వస్తుంది. ఇది చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవుదినం. అక్టోబర్ 22న గోవర్ధన పూజ కోసం, అక్టోబర్ 23న భాయ్ దూజ్ కోసం పాఠశాలలు మూసి ఉంటాయి. అయితే ఈ సెలవుల వ్యవధి రాష్ట్రం లేదా పాఠశాల యాజమాన్యాన్ని బట్టి మారవచ్చని గుర్తించుకోండి. అన్ని రాష్ట్రాల్లో అన్ని రోజులు సెలవులు ఉండవచ్చు.. లేదా ఉండకపోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి