Diwali 2023: హిమాచల్‌లోని లెప్చా చేరుకున్న ప్రధాని మోడీ.. సైనికులతో కలిసి దీపావళి వేడుకలు..

|

Nov 12, 2023 | 11:19 AM

నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపావళి పండుగను సైనికులతో  జరుపుకుంటున్నారు. 2014లో దీపావళి సందర్భంగా సియాచిన్ గ్లేసియర్‌లో సైనికులతో కలిసి నరేంద్ర మోడీ దీపావళిని జరుపుకున్నారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ 2015లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సైనికులతో కలిసి జరుపుకున్నారు.

Diwali 2023: హిమాచల్‌లోని లెప్చా చేరుకున్న ప్రధాని మోడీ.. సైనికులతో కలిసి దీపావళి వేడుకలు..
Pm Modi Diwali
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా దీపావళిని ఘనంగా జరుపుకుంటున్నారు. భారత ఆర్మీ సైనికులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి జరుపుకోనున్నారు. ప్రధాని మోడీ దేశ సరిహద్దు రేఖ లేదా వాస్తవ నియంత్రణ రేఖ వద్ద సైనికుల మధ్య ప్రతి సంవత్సరం దీపావళిని జరుపుకుంటున్నారు. ఈసారి కూడా నరేంద్ర మోడీ  సరిహద్దుల్లో దేశ సైనికులతో కలిసి దీపావళి జరుపుకోనున్నారు. భారత్-చైనా సరిహద్దులో హిమాచల్ లోని లేప్చా లో ప్రధాని మోదీ దీపావళిని జరుపుకోనున్నారు. సైనికులకు మిఠాయిలు పంచనున్నారు.

దీపావళి సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ (మొదటి ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ, ‘దేశంలోని మా కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన పండుగ మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు , మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రధాని మోడీ దీపావళి సందర్భంగా స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 దీపావళి శుభాకాంక్షలు.

ఈ దీపావళికి నమో యాప్‌లో వోకల్ ఫర్ లోకల్‌తో భారతదేశం వ్యవస్థాపకత, సృజనాత్మక స్ఫూర్తిని జరుపుకుందాం అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. స్థానికంగా తయారు చేయబడిన ఉత్పత్తులను కొనుగోలు చేసి.. అనంతరం నమో యాప్‌లో ఉత్పత్తి లేదా తయారీదారుతో ఉన్న సెల్ఫీని షేర్ చేయమని కూడా పేర్కొన్నారు. మీరు మీతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయమని ఆహ్వానించండి. సానుకూల స్ఫూర్తిని వ్యాప్తి చేయండని విజ్ఞప్తి చేశారు.

ప్రధాని మోడీ దీపావళిని ఎక్కడ జరుపుకున్నారంటే

నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపావళి పండుగను సైనికులతో  జరుపుకుంటున్నారు. 2014లో దీపావళి సందర్భంగా సియాచిన్ గ్లేసియర్‌లో సైనికులతో కలిసి నరేంద్ర మోడీ దీపావళిని జరుపుకున్నారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ 2015లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సైనికులతో కలిసి జరుపుకున్నారు.

2016లో హిమాచల్‌లోని కిన్నౌర్‌లో సైనికుల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి జరుపుకున్నారు. 2017లో జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్‌లో సైనికులతో కలిసి.. 2018 సంవత్సరంలో ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ చేరుకున్నారు. భారత్-చైనా సరిహద్దుకు సమీపంలోని హర్సిల్ గ్రామంలో ఆర్మీ, ఐటీబీపీ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

2022లో కార్గిల్ కొండలపై దీపావళి జరుపుకున్నారు. 2019 సంవత్సరంలో, జమ్మూ డివిజన్‌లోని రాజౌరి సైనిక సిబ్బందితో దీపావళి జరుపుకున్నారు. 2020లో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ప్రధాన మంత్రి దీపావళిని జరుపుకున్నారు. 2021లో, రాజౌరీ జిల్లాలోని నౌషాహ్రా సెక్టార్‌లో ఆర్మీ సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్న ప్రధాని మోడీ, 2022లో కార్గిల్ కొండలపై ఆర్మీ సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..