బ్రేకింగ్ : దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీం కీలక నిర్ణయం

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై ముగ్గురు సభ్యులతో కమిషన్‌ ఏర్పాటుకు సుప్రీంకోర్టు  ఆదేశాలు జారీచేసింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్‌పుర్కార్ అధ్యక్షతన ఈ కమిషన్ ఏర్పాటయ్యింది. ఇందులో వీఎస్ సిర్ పుర్కార్‌తో పాటుగా రేఖ, కార్తికేయన్‌లను సుప్రీం నియమించింది. మరే ఇతర కమిటీ గానీ, అథారిటీ గానీ తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు విచారణ జరపరాదని ఆదేశించింది. కాగా, ఈ […]

బ్రేకింగ్ : దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీం కీలక నిర్ణయం

Edited By:

Updated on: Dec 12, 2019 | 1:39 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై ముగ్గురు సభ్యులతో కమిషన్‌ ఏర్పాటుకు సుప్రీంకోర్టు  ఆదేశాలు జారీచేసింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్‌పుర్కార్ అధ్యక్షతన ఈ కమిషన్ ఏర్పాటయ్యింది. ఇందులో వీఎస్ సిర్ పుర్కార్‌తో పాటుగా రేఖ, కార్తికేయన్‌లను సుప్రీం నియమించింది. మరే ఇతర కమిటీ గానీ, అథారిటీ గానీ తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు విచారణ జరపరాదని ఆదేశించింది. కాగా, ఈ కమిషన్‌కు సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తుందని సుప్రీం పేర్కొంది. కమిషన్ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సూచించింది. అంతేకాదు.. కమిషన్ విచారణపై మీడియా కవరేజ్ ఉండకూడదని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఆరు నెలల్లో విచారణ ముగించాలని స్పష్టం చేసింది.