దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా(Corona) కేసులు మరోసారి ఆందోళన రేకెత్తిస్తున్నాయి. చాలా మంది ఆరోగ్య నిపుణులు కరోనా మార్గదర్శకాలను(Corona Guidelines) ఖచ్చితంగా పాటించాలని ప్రజలను కోరుతున్నారు. దేశంలో పెరుగుతున్న కరోనా (Coronavirus) కేసుల మధ్య, చాలా కేసులలో తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు. వార్తా సంస్థ ANI ప్రకారం, ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి చెందిన సీనియర్ వైద్యుడు నిఖిల్ మోడీ మాట్లాడుతూ, గత 10 రోజుల్లో కరోనా రోగుల సంఖ్య వేగంగా పెరిగింది.
అయితే చాలా కేసుల్లో తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్ మోదీ తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ 19 లక్షణాలలో జ్వరం, ముక్కు కారటం, తుమ్ములు, గొంతు నొప్పి, దగ్గు వంటి తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ఇటీవల అతిసారం కోవిడ్ లక్షణంగా కనిపిస్తోందని ఆయన పేర్కొనడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ అంటువ్యాధి నివారణకు పోరాడాలని సూచించిన ఆయన, ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్న వేగాన్ని దృష్టిలో ఉంచుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
కరోనా సోకిన రోగులలో డయేరియా వంటి కడుపు సంబంధిత సమస్యలు కనిపించడం ఇదే తొలిసారి అని డాక్టర్ మోదీ అన్నారు. గత 10 రోజుల్లో, అతిసారం వంటి వ్యాధులకు సంబంధించిన చాలా మంది కరోనా రోగులు తెరపైకి వచ్చారు. అయితే ఆసుపత్రిలో చేరే రేటు చాలా తక్కువగా ఉంది. ఇప్పటికే ఆరోగ్య సంబంధిత వ్యాధులు ఉన్నవారిని మాత్రమే ఆసుపత్రిలో చేర్చుకోవాల్సి ఉంటుంది.
టెస్ట్, ట్రాక్, ట్రీట్ వ్యూహాన్ని అనుసరించాలి: ప్రధాని మోదీ..
గత కొన్ని రోజులుగా, దేశంలో రెండు వేల మందికి పైగా కరోనా రోగులు తెరపైకి వస్తున్నాయి. బుధవారం, కరోనా సోకిన రోగుల సంఖ్య 2927లకు చేరగా, మంగళవారం వారి సంఖ్య 2483గా నిలిచింది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, సంక్రమణను ప్రారంభంలోనే ఆపడం మన ప్రాధాన్యత అని, టెస్ట్, ట్రాక్, ట్రీట్ వ్యూహాన్ని అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు.
మరిన్ని కరోనా అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
PM Narendra Modi: కరోనా ఫోర్త్ వేవ్ అలర్ట్.. ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ.. ఈ అంశాలపైనే చర్చ..