Pulwama Encounter: జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..

జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలో(Pulwama) ఉగ్రవాదలు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

Pulwama Encounter: జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..
Encounter
Sanjay Kasula

|

Apr 28, 2022 | 8:08 AM

జమ్ము కశ్మీర్‌లో(J&K) భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలో(Pulwama) ఉగ్రవాదలు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు(Pulwama encounter) జరిగాయి. మిత్రిగామ్ ప్రాంతంలో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రహదులు హతమయ్యారు. వారి నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో మరో ఉగ్రవాది హతమైనట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. హతమైన ఇద్దరు ఉగ్రవాదులను స్థానిక ఉగ్రవాదులు ఎజాజ్ హఫీజ్, షాహిద్ అయూబ్‌లుగా గుర్తించారు. ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరూ అల్ బద్రే సంస్థకు చెందినవారు.

ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదులు 2022 మార్చి-ఏప్రిల్ నెలలో జిల్లాలో బయటి నుంచి వచ్చిన కార్మికులపై అనేక దాడుల్లో పాల్గొన్నారని ఐజిపి కశ్మీర్ విజయ్ కుమార్ తెలిపారు. కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) విజయ్ కుమార్ ఈ వివారాలను వెల్లడించారు. జైష్-ఎ-మహ్మద్ (JeM) సంస్థకు చెందిన పాకిస్తానీ ఉగ్రవాదితో సహా ఇద్దరు-ముగ్గురు ఉగ్రవాదులు చుట్టుముట్టారు.  పౌరుల తరలింపు కారణంగా ఆపరేషన్‌ మధ్యలోనే నిలిచిపోయింది.

తాజాగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు..

ఆదివారం (ఏప్రిల్ 24) జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత సంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ కమాండర్ సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. హతమైన ఉగ్రవాదులను శ్రీనగర్‌లోని ఖన్యార్‌లో నివాసం ఉంటున్న ఆరిఫ్ అహ్మద్ హజార్ అలియాస్ రెహాన్ , నతీష్ వానీ అలియాస్ హైదర్‌గా గుర్తించారు.

ఇవి కూడా చదవండి: Donald Trump: ట్రంప్‌ రోజూ 10 వేల డాలర్లు జరిమానా కట్టాలటా.. ఎందుకో తెలుసా?

Andhra vs Odisha: ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో టెన్షన్‌.. కోడిగుడ్ల లారీల అడ్డగింత.. రైతుల ఆందోళన..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu