డైమండ్ మర్చంట్ మెహుల్ చోక్సీ ని సీబీఐ మహిళా అధికారి ఇండియాకు తీసుకువస్తారా ? డొమినికా కోర్టు ఏం చెబుతుంది ?

డైమండ్ వ్యాపారి మేహూల్ చోక్సీని డొమినికా నుంచి సీబీఐ మహిళా అధికారి శారదా రౌత్ ఇండియాకు తీసుకువస్తారా ? ఆయనను భారత్ కు అప్పగించాలని కోర్టు ఆదేశిస్తే ఆ అధికారి ఇందుకు ప్రయత్నిస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

డైమండ్ మర్చంట్ మెహుల్ చోక్సీ ని సీబీఐ మహిళా  అధికారి ఇండియాకు తీసుకువస్తారా ? డొమినికా కోర్టు ఏం చెబుతుంది ?
Mehul Choksi

Edited By: Anil kumar poka

Updated on: Jun 02, 2021 | 4:08 PM

డైమండ్ వ్యాపారి మేహూల్ చోక్సీని డొమినికా నుంచి సీబీఐ మహిళా అధికారి శారదా రౌత్ ఇండియాకు తీసుకువస్తారా ? ఆయనను భారత్ కు అప్పగించాలని కోర్టు ఆదేశిస్తే ఆ అధికారి ఇందుకు ప్రయత్నిస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. . ఈమె ప్రస్తుతం మరో ఏడుగురు భారతీయ అధికారులతో కలిసి డొమినికాలో ఉన్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే ప్రైవేట్ జెట్ విమానంలో ఆమె ఆయనను ఇండియాకు తీసుకురావచ్చు. ఆ వెంటనే ఆయనను ఢిల్లీ విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇండియాలో చోక్సీ క్రిమినాలజీ గురించి ఈడీ అధికారులు అక్కడి కోర్టుకు తెలియజేయవచ్చు..పైగా అక్కడి ప్రాసిక్యూటర్ల ద్వారా సీబీఐ కూడా ఇండియాలో చోక్సీపై గల కేసుల గురించి వారికి తెలియజేస్తారని అంటున్నారు. 2018 జనవరి నుంచే ఆయనకోసం ఇంటర్ పోల్ రెడ్ నోటీసు జారీ చేసిందని కోర్టుకు వివరించవచ్చు. 2017 లో మెహుల్ చోక్సీ ఆంటిగ్వా పొరసత్వం తీసుకున్నారు. కానీ తన భారతీయ పౌరసత్వం వదులుకున్న (సరెండర్) ప్రయత్నాలు చేయలేదు. అందువల్ల అయన ఇప్పటికీ భారతీయుడే అని అధికారులు వాదిస్తున్నారు. ఆంటిగ్వా నుంచి ఆయన మే 23 నుంచి మిస్సింగ్ అయిన సంగతి విదితమే..

కాగా చోక్సీతో కలిసి వెళ్లిన మహిళ ఆయన గర్ల్ ఫ్రెండ్ కాదని, ఆయనను ‘కిడ్నాప్’ చేయడానికి యత్నించిన బృందంలోని మహిళ అని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ఆయన గర్ల్ ఫ్రెండ్ అంటూ ఆంటిగ్వా ప్రధానిబ్రౌన్ ఎద్దేవా చేశారు. కానీ చోక్సీ ని ట్రాప్ లో పడేసేందుకు ఈ మహిళను కిడ్నాపర్ల బృందం వినియోగించుకుందని కూడా తెలుస్తోంది.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : చిన్నారి చిరు సాయానికి మెగాస్టార్ ఫిదా..పుట్టినరోజుకు దాచుకున్న మనీ అంత డొనేట్ చేసిన చిన్నారి.: Chiranjeevi Fida for child’s help video

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రణీత..ప్రేమ పెళ్లి అంట.ఇంతకీ పెళ్ళికొడుకు ఎవరో తెలుసా..?:Pranitha’s secret marriage Video.

 బ్రేక్ లు ఫెయిల్ అయ్యిన లారీ ని ఎంతో నైపుణ్యంగా 3 కి.మీ రివర్స్ లో డ్రైవింగ్.. వైరల్ అవుతున్న వీడియో,ఫిదా అవుతున్న నెటిజెన్లు : Viral Video

Viral Video: ఎలుకకు జోలపాట పడుతున్న మూడేళ్ళ పాప..వైరల్ అవుతున్న వీడియో.