Bageshwar Dham: కోహినూర్‌ను భారత్‌కు తీసుకొస్తా.. లండన్‌లో భాగేశ్వర్‌బాబా సంచలన వ్యాఖ్యలు

|

Jul 27, 2023 | 9:12 PM

Bageshwar Sarkar on Kohinoor: కోహినూర్‌ డైమండ్‌ను భారత్‌కు తప్పకుండా తీసుకొస్తానని అంటున్నారు భాగేశ్వర్‌ బాబా.. లండన్‌ గడ్డపై ఆయన ఈ శపథం చేశారు. ఒకప్పుడు బ్రిటీష్‌ వాళ్లు భారత్‌ను శాసించారని , కాని ఇప్పుడు వాళ్లే భారతీయులు ప్రవచనాలు వినడానికి క్యూ కడుతున్నారని అన్నారు.

Bageshwar Dham: కోహినూర్‌ను భారత్‌కు తీసుకొస్తా.. లండన్‌లో భాగేశ్వర్‌బాబా సంచలన వ్యాఖ్యలు
Bageshwar Dham On Kohinoor
Follow us on

ఉత్తర భారతంలో తన ప్రవచనాలతో ప్రకంపనలు రేపిన భాగేశ్వర్‌ బాబా ధీరేంద్రశాస్త్రి లండన్‌లో కూడా దుమ్ము రేపుతున్నారు. లండన్‌లో బాబా భాగశ్వర్‌ బాబా కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు. లండన్‌లో ఉన్న కోహినూర్‌ డైమండ్‌ను భారత్‌కు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని సంచలన ప్రకటన చేశాడు భాగేశ్వర్‌ బాబా. ప్రవాస భారతీయులతో పాటు బ్రిటీష్‌ పౌరులు కూడా బాబా దర్బార్‌కు తరలివచ్చారు. ఉత్తర భారతంలో ప్రత్యక్ష దైవంగా భావిస్తున్న ధీరేంద్రశాస్త్రి ఆశీస్సులు తీసుకున్నారు. లండన్‌లో రామ్‌కథను విన్పించడానికి వెళ్లారు బాబా భాగేశ్వర్‌. బ్రిటీష్‌ ఉన్నతాధికారులు కూడా ఆయన ప్రవచనాలు వినడానికి చాలా ఆసక్తి చూపించారు. సైమన్‌ అనే బ్రిటీష్‌ పౌరుడు కూడా ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో కోహినూర్‌ వజ్రంపై మాట్లాడారు బాబా భాగేశ్వర్‌. ఆయన ప్రవచనాలు వినడానికి వందలాదిమంది జనం క్యూ కట్టారు.

లండన్‌లో అడుగుపెట్టినప్పుడు తనకు ఓ వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చిందన్నారు భాగేశ్వర్‌బాబా.. భారత్‌ నుంచి బ్రిటీష్‌వాళ్లు ఎప్పుడో కోహినూర్‌ వజ్రాన్ని తీసుకెళ్లారని , ఆ డైమండ్‌ను భారత్‌కు తీసుకెళ్లాలన్న సంకల్పం తనకు ఉందన్నారు. అయితే సత్సంగ్‌లో ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదన్న విషయం తనకు తెలుసన్నారు. అలాంటి డిమాండ్‌ చేస్తే లండన్‌కు తనను తిరిగి రానివ్వరన్న విషయం తెలుసన్నారు భాగేశ్వర్‌ బాబా. సరదాగా తాను మాట్లాడిన విషయాన్ని ఎవరు సీరియస్‌గా తీసుకోవద్దని కూడా సూచించారు.

ఇవి కూడా చదవండి

ఓ వ్యక్తి ఫోన్‌ చేస్తే లండన్‌ లోనే చాలా బాగుందని చెప్పా.. బాధపడవద్దు .. కోహినూర్‌ డైమండ్‌ను తప్పకుండా భారత్‌కు తీసుకొస్తా అని చెప్పా.. అయితే కోహినూర్‌ను వెనక్కి తీసుకురావడం చాలా కష్టం.. ఇక్కడికి నేను చాలాసార్లు రావాలి. కోహినూర్‌ కావాలని అడిగితే అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తాయి. సీరియస్‌గా తీసుకోవద్దు… జోక్‌గా మాట్లాడా.. నేను ఏది దాచుకోను. నా మనస్సులో ఉన్న విషయాన్ని తెలిపానని అన్నారు భాగేశ్వర్‌ధామ్‌ మఠాధిపతి.

కోహినూర్‌ డైమండ్‌ను ఈస్టిండియా కంపెనీ1849తో బ్రిటన్‌కు తరలించింది. క్వీన్‌ విక్టోరియాకు ఆ డైమండ్‌ను అప్పగించారు. ప్రస్తుతం బ్రిటీష్‌ రాజకుటుంబం దగ్గర కోహినూర్‌ డైమండ్‌ ఉంది. భారత్‌కు ఆ డైమండ్‌ను తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో లండన్‌కు వెళ్లి భాగేశ్వర్‌బాబా కోహినూర్‌ డైమండ్‌ను భారత్‌ను తీసుకెళ్తానని ప్రకటించడం సంచలనం రేపింది. అంతేకాకుండా ఒకప్పుడు బ్రిటీష్‌ వాళ్లు భారత్‌ను శాసించారని , ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిందన్నారు.

లండన్‌లో తన దర్బార్‌కు భారీగా బ్రిటీష్‌ పౌరులు హాజరుకావడమే ఇందుకు నిదర్శనమన్నారు. మధ్యప్రదేశ్‌ లోని చతర్‌పూర్‌లో భాగేశ్వర్‌ధామ్‌ ఉంది. భగవాన్‌ హనుమాన్‌కు ఆ ధామ్‌ను అంకితమిచ్చారు . 26 ధీరేంద్రశాస్త్రి ఈ మఠానికి అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం