Dharmendra Pradhan: ఎన్నిసార్లు అవిశ్వాసం పెట్టినా నో యూజ్.. విపక్షాలపై ధర్మేంధ్ర ప్రదాన్ ఆగ్రహం..

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విపక్షాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఫైర్ అయ్యారు. విపక్షాలు ఏకమైనా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవన్నారు. ట్విట్టర్ వేదికగా విపక్షాల తీరును తూర్పారపట్టారు. దేశ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రతిపక్షాలు.. ప్రధాని మోదీపై ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం పెట్టినా ఉపయోగం ఉండదని అన్నారు. ప్రజలచే పదే పదే తిరస్కరించబడి,

Dharmendra Pradhan: ఎన్నిసార్లు అవిశ్వాసం పెట్టినా నో యూజ్.. విపక్షాలపై ధర్మేంధ్ర ప్రదాన్ ఆగ్రహం..
Dharmendra Pradhan

Edited By:

Updated on: Jul 25, 2023 | 6:26 PM

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విపక్షాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఫైర్ అయ్యారు. విపక్షాలు ఏకమైనా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవన్నారు. ట్విట్టర్ వేదికగా విపక్షాల తీరును తూర్పారపట్టారు. దేశ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రతిపక్షాలు.. ప్రధాని మోదీపై ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం పెట్టినా ఉపయోగం ఉండదని అన్నారు. ప్రజలచే పదే పదే తిరస్కరించబడి, విశ్వాసాన్ని కోల్పోయిన విపక్ష కూటమి.. I.N.D.I.A గా పేరు మార్చుకున్న మాత్రాన ఒరిగేదేమీ లేదన్నారు. విపక్ష కూటమిని ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చిన ధర్మేంద్ర ప్రదాన్.. ఆ కూటమికి ప్రజల చేతిలో మరోసారి ఘోర పరాభవం తప్పదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న నమ్మకం, విశ్వాస జ్వాలను ఆర్పడం ఎవరితరం కాదని అన్నారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..