బ్రేకింగ్ : సీఎం పదవికి రాజీనామా చేసిన దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర రాజకీయం క్షణక్షణం ఉత్కంఠగా మారుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మరికొద్ది గంటలు ఉన్న నేపథ్యంలో.. ఏం జరగబోతోందోనన్న టెన్షన్ అన్ని పార్టీల్లో నెలకొంది. బీజేపీ, శివసేన రెండు పార్టీలు మెట్టుదిగకపోవడంతో.. ప్రభుత్వ ఏర్పాటుపై అనుమానాలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ గడువు శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మంత్రుల బృందం.. రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిసింది. సీఎం […]
మహారాష్ట్ర రాజకీయం క్షణక్షణం ఉత్కంఠగా మారుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మరికొద్ది గంటలు ఉన్న నేపథ్యంలో.. ఏం జరగబోతోందోనన్న టెన్షన్ అన్ని పార్టీల్లో నెలకొంది. బీజేపీ, శివసేన రెండు పార్టీలు మెట్టుదిగకపోవడంతో.. ప్రభుత్వ ఏర్పాటుపై అనుమానాలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ గడువు శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మంత్రుల బృందం.. రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిసింది. సీఎం పదవికి రాజీనామా చేస్తున్న లేఖను.. ఫడ్నవీస్ గవర్నర్‌కు అందజేశారు. తన రాజీనామాను గవర్నర్ ఆమోదించారన్న విషయాన్ని ఫడ్నవీస్ వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌కు బీజేపీ కోరకపోవడంపై.. మరో ఉత్కంఠకు తెరతీసింది. మరోవైపు సీఎం పదవిని తమ పార్టీనేత అందుకోబోతున్నట్లు శివసేన నేతలు ప్రకటిస్తున్నారు. మరికాసేపట్లో దీనిపై స్పష్టత రాబోతుంది.
Mumbai: Maharashtra Chief Minister Devendra Fadnavis and other state ministers meet Governor Bhagat Singh Koshyari at Raj Bhawan. pic.twitter.com/grmCMrHLg9
— ANI (@ANI) November 8, 2019