AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నోట ఆర్‌ఎస్‌ఎస్ గీతం.. బీజేపీలో చేరబోతున్నారా..?

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురువారం (ఆగస్టు 21) అసెంబ్లీలో గందరగోళం సృష్టించారు. ఆయన హఠాత్తుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పాట పాడటం వివాదం రాజుకుంది. దీని తర్వాత, భారతీయ జనతా పార్టీ (BJP) కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంది. వాస్తవానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఆర్ఎస్ఎస్‌ను ప్రశంసించారు. దీని కోసం కాంగ్రెస్ ప్రధాని మోదీని విమర్శించింది.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నోట ఆర్‌ఎస్‌ఎస్ గీతం.. బీజేపీలో చేరబోతున్నారా..?
Karnataka Deputy Cm Dk Shivakumar
Balaraju Goud
|

Updated on: Aug 22, 2025 | 12:05 PM

Share

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురువారం (ఆగస్టు 21) అసెంబ్లీలో గందరగోళం సృష్టించారు. ఆయన హఠాత్తుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పాట పాడటం వివాదం రాజుకుంది. దీని తర్వాత, భారతీయ జనతా పార్టీ (BJP) కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంది. వాస్తవానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఆర్ఎస్ఎస్‌ను ప్రశంసించారు. దీని కోసం కాంగ్రెస్ ప్రధాని మోదీని విమర్శించింది. ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీలో డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతం పాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఇంతలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతం అందుకున్నారు. “నమస్తే సదా వత్సలే మాతృభూమి” అంటూ పాడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన శైలిని చూసి కాంగ్రెస్‌ పార్టీ కూడా షాకింగ్‌గా ఉంది. కాంగ్రెస్ ఎప్పుడూ ఆర్ఎస్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతాన్ని పాడటం అశ్చర్యపరిచింది. మరోవైపు కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఎద్దేవా చేస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులలో ఎక్కువ మంది ఆర్ఎస్ఎస్‌ను ప్రశంసిస్తున్నారని అన్నారు.

దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఆయన పేర్కొన్నారు, ” నమస్తే సదా వత్సలే మాతృభూమి… కర్ణాటక అసెంబ్లీలో డీకే శివకుమార్ ఆర్‌ఎస్‌ఎస్ గీతం పాడుతూ కనిపించారు. రాహుల్ గాంధీ, గాంధీ-వాద్రా కుటుంబానికి సన్నిహితులు ఇప్పుడు షాక్‌లో ఉన్నారు .” కాంగ్రెస్‌లో విభేదాలు పెరిగాయని భండారి అన్నారు. ప్రస్తుతం పార్టీలో ఏ ఎంపీ కూడా రాహుల్ గాంధీని సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

డీకే శివకుమార్ వీడియో బయటకు వచ్చిన తర్వాత, ఆయన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇది ప్రత్యక్ష హెచ్చరికగా భావిస్తున్నారు. అయితే, ఈ పుకార్ల గురించి ఇంకా అధికారిక స్పందన రాలేదు. శుక్రవారం (ఆగస్టు 22) కర్ణాటక శాసనసభలో వర్షాకాల సమావేశాల చివరి రోజు.

ఈ వీడియో వివాదానికి దారితీయడంతో, డీకే శివకుమార్ స్పందించారు. “నేను పుట్టుకతోనే కాంగ్రెస్ వాదిని. నాయకుడిగా నా ప్రత్యర్థుల, స్నేహితులు ఎవరో తెలుసుకోవాలి. నేను వారి గురించి అధ్యయనం చేశాను. బీజేపీతో చేతులు కలిపే ప్రశ్నే లేదు. పుట్టినప్పటి నుండి జీవితాంతం కాంగ్రెస్‌తోనే ఉన్నాను. ఉంటాను” అంటూ స్పష్టం చేశారు. జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటపై అసెంబ్లీ చర్చను నిర్వహిస్తుండగా, శివకుమార్ ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చారు. ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాల అనేక లోపాలను కూడా తాను ఎత్తి చూపగలనని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..