కశ్మీర్ విషయంలో దాగుడుమూతలెందుకు ? ఈయూ ఎంపీ గుస్సా
జమ్మూ కశ్మీర్ ను సందర్శించకుండా తనను మోదీ ప్రభుత్వం అడ్డుకుందని యూరోపియన్ పార్లమెంటులో లిబరల్ డెమొక్రాట్ ఎంపీ క్రిస్ డేవిస్ ఆరోపించారు. కశ్మీర్ రాష్ట్రాన్ని విజిట్ చేయాలని తనకు ఈ నెల 7 న ఆహ్వానం అందిందని, కానీ మూడు రోజుల అనంతరం దాన్ని రద్దు చేశారని ఆయన అన్నారు. కశ్మీర్ లో ప్రజాస్వామ్య సూత్రాలను అణగదొక్కుతున్నారని, మోదీ సర్కార్ చేస్తున్న ఈ విధమైన ‘ స్టంట్ ‘ లో తాను భాగం కాదల్చుకోలేదని డేవిస్ మండిపడ్డారు.’ […]
జమ్మూ కశ్మీర్ ను సందర్శించకుండా తనను మోదీ ప్రభుత్వం అడ్డుకుందని యూరోపియన్ పార్లమెంటులో లిబరల్ డెమొక్రాట్ ఎంపీ క్రిస్ డేవిస్ ఆరోపించారు. కశ్మీర్ రాష్ట్రాన్ని విజిట్ చేయాలని తనకు ఈ నెల 7 న ఆహ్వానం అందిందని, కానీ మూడు రోజుల అనంతరం దాన్ని రద్దు చేశారని ఆయన అన్నారు. కశ్మీర్ లో ప్రజాస్వామ్య సూత్రాలను అణగదొక్కుతున్నారని, మోదీ సర్కార్ చేస్తున్న ఈ విధమైన ‘ స్టంట్ ‘ లో తాను భాగం కాదల్చుకోలేదని డేవిస్ మండిపడ్డారు.’ ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఈ తీరు అందరికీ తెలిసిందే.. ప్రపంచ దేశాలు ఇప్పుడైనా ఈ అంశాన్ని గమనించడం ప్రారంభించాలి ‘ అని ఆయన కోరాడు.
జమ్మూ కశ్మీర్లోని ప్రజలతో ఎవరితోనైనా స్స్వేఛ్చగా మాట్లాడవచ్ఛునని మొదట తనకు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారని, కానీ ఆ తరువాత ప్రభుత్వ వైఖరి ఎందుకు మారిందని డేవిస్ ప్రశ్నించాడు. ఇందులోదాచడానికి భారత ప్రభుత్వానికి ఏముంది ? జర్నలిస్టులు, రాజకీయ నాయకులను స్వేఛ్చగా ప్రజలతో మాట్లాడేందుకు ఎందుకు అనుమతించడం లేదు అని అన్నాడు. ఇంగ్లండ్ లో నేను కొంతమంది కశ్మీరీలను కలిశాను.. .. కశ్మీర్ లోని తమ కుటుంబ సభ్యులను, బంధువులను తాము కాంటాక్ట్ చేయలేకపోతున్నామని వాళ్ళు చెప్పారు. ఇదెక్కడి తీరు అని కూడా ఆయన అన్నాడు. ఇది భారత ప్రభుత్వానికి మంచి పధ్దతి కాదు అని దుయ్యబట్టారు. సుమారు 27 మంది యూరోపియన్ యూనియన్ ఎంపీలు మంగళవారం కశ్మీర్ ను విజిట్ చేసిన నేపథ్యంలో డేవిస్ ‘ మండిపాటు ‘ ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా.. వారిని మోదీ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించి.. ఇందుకు అనుమతించింది.
అయితే ఈ ఎంపీ గారి ( క్రిస్) బాగోతం ఆ మధ్య వెలుగు చూసింది. ఓ స్కామ్ లో ఈయన దోషిగా తేలడంతో రీ-కాల్ పిటిషన్ అనంతరం తన పదవిని కోల్పోయాడు. తన ఎన్నికకు సంబంధించి తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించాడని ఈయనపై ఆరోపణలొచ్చాయి. బ్రిటన్ లో గత జూన్ లో జరిగిన ‘ వ్యవహార మిది ‘.. అయితే తన తప్పిదానికి డేవిస్ క్షమాపణ చెప్పుకొన్నాడు. ఇతనికి కోర్టు… 1500 పౌండ్ల జరిమానా విధించడమే గాక, 50 గంటల సామాజిక సేవ చేయాలని ఆదేశించింది.