కొరడా దెబ్బలు తిన్న సీఎం..ఎందుకు?
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగల్ గుడిలో పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్నారు. సోమవారం గోవర్థన పూజ సందర్భంగా రాయ్‌పూర్‌లోని దుర్గ్‌లో ఓ ఆలయాన్ని సీఎం భూపేష్ భగల్ సందర్శించారు. అయితే, అక్కడ ఆలయ సంప్రదాయం ప్రకారం.. అమ్మవారి ఎదుట పూజారీ చేత్తో కొరడా దెబ్బలు తింటే మంచిదని స్థానికుల నమ్మకం. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి కూడా కొరడా దెబ్బలు తినేందుకు సిద్ధమయ్యారు. తన కుడిచేతి చొక్కాను కొంచెం పైకి లాగారు. అనంతరం పూజారి ముఖ్యమంత్రి […]
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగల్ గుడిలో పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్నారు. సోమవారం గోవర్థన పూజ సందర్భంగా రాయ్‌పూర్‌లోని దుర్గ్‌లో ఓ ఆలయాన్ని సీఎం భూపేష్ భగల్ సందర్శించారు. అయితే, అక్కడ ఆలయ సంప్రదాయం ప్రకారం.. అమ్మవారి ఎదుట పూజారీ చేత్తో కొరడా దెబ్బలు తింటే మంచిదని స్థానికుల నమ్మకం. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి కూడా కొరడా దెబ్బలు తినేందుకు సిద్ధమయ్యారు.
తన కుడిచేతి చొక్కాను కొంచెం పైకి లాగారు. అనంతరం పూజారి ముఖ్యమంత్రి చేతిపై కొరడా దెబ్బలను కొట్టారు. ఆరు కొరడా దెబ్బలు పడిన తర్వాత ముఖ్యమంత్రి ఇక చాలు అన్నట్టుగా తన చేతిని వెనక్కు తీశారు. కొరడా దెబ్బలు తింటున్న సమయంలో ముఖ్యమంత్రి భూపేష్ భగల్ నవ్వుతూ కనిపించారు. అనంతరం సీఎం.. పూజారిని ఆత్మీయంగా కౌగిలించుకోని అక్కడనుంచి బయటకు వెళ్లారు.