రోడ్డు ప్రమాదంలో నటుడు మృతి..భార్య పరిస్థితి విషమం

తమిళ నటుడు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు మనో కారు ప్రమాదంలో మృతి చెందాడు. అక్టోబర్ 28న చెన్నై పట్టణానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తుదిశ్వాస విడిచారు. ఈ దుర్ఘటనలో మనో భార్య కూడా తీవ్రగాయాలతో మృత్యువుతో పోరాడుతున్నది. మనో ఆకస్మిక మరణంతో కోలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మంచి భవిష్యత్ ఉందనుకుంటోన్న నటుడు ఇలా అర్థాంతరంగా తనవు చాలించడంతో.. పలువురు సోషల్ మీడియాలో తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీపావళీ రోజున కుటుంబ కార్యక్రమం […]

రోడ్డు ప్రమాదంలో నటుడు మృతి..భార్య పరిస్థితి విషమం
Follow us
Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Updated on: Oct 29, 2019 | 6:09 PM

తమిళ నటుడు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు మనో కారు ప్రమాదంలో మృతి చెందాడు. అక్టోబర్ 28న చెన్నై పట్టణానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తుదిశ్వాస విడిచారు. ఈ దుర్ఘటనలో మనో భార్య కూడా తీవ్రగాయాలతో మృత్యువుతో పోరాడుతున్నది. మనో ఆకస్మిక మరణంతో కోలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మంచి భవిష్యత్ ఉందనుకుంటోన్న నటుడు ఇలా అర్థాంతరంగా తనవు చాలించడంతో.. పలువురు సోషల్ మీడియాలో తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దీపావళీ రోజున కుటుంబ కార్యక్రమం కోసం భార్యతో కలిసి వెళ్తుండగా చెన్నైలోని మీడియన్ రోడ్డులో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకొన్నది. యాక్సిడెంట్ జరిగినప్పుడు భార్య, మనో మాత్రమే కారులో ఉన్నారు. మీడియన్ రోడ్డులో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో వారిద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారని, మనోకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలో మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. కాగా మనో దంపతులకు ఏడేళ్ల కూతురు కూడా ఉంది.

టెలివిజన్ ఛానల్ హోస్ట్‌గా ప్రొఫెషనల్ జీవితాన్ని ప్రారంభించారు మనో. పలు రియాలిటీ షోలలో ఆయన తన మిమిక్రీ, డ్యాన్సింగ్ టాలెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సిల్వర్ స్రీన్‌ వైపు అడుగులు వేశాడు. తమిళంలో పుజల్, మాన్నద మేయిలాదా చిత్రాలు మనోకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.