ఇసుకపై విసుర్లు.. జగన్ ఏమన్నారంటే ?
ఏపీ ప్రభుత్వ ఇసుక విధానంపై విమర్శలు చేస్తున్న విపక్షాలపై ముఖ్యమంత్రి జగన్ సునిశిత వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇసుక విధానంలో వున్న లోపాల కారణంగా అక్రమంగా ఇసుకను దోచేశారని, అవినీతిని పూర్తిగా అరికట్టి సక్రమంగా ఇసుకను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తుంటే విపక్షాల దారుణంగా ఆరోపణలు చేస్తున్నాయని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలు, పంపిణీపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్.జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. పళ్లు ఇచ్చే చెట్టుమీదే రాళ్లు వేస్తున్నారని జగన్ […]

ఏపీ ప్రభుత్వ ఇసుక విధానంపై విమర్శలు చేస్తున్న విపక్షాలపై ముఖ్యమంత్రి జగన్ సునిశిత వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇసుక విధానంలో వున్న లోపాల కారణంగా అక్రమంగా ఇసుకను దోచేశారని, అవినీతిని పూర్తిగా అరికట్టి సక్రమంగా ఇసుకను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తుంటే విపక్షాల దారుణంగా ఆరోపణలు చేస్తున్నాయని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలు, పంపిణీపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్.జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు.
పళ్లు ఇచ్చే చెట్టుమీదే రాళ్లు వేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలలో, పంపిణీలలో ఎక్కడైనా అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించానని జగన్ అన్నారు. గతంలో రాబందుల మాదిరిగా ఇసుకను దోచుకున్నవారు ఇపుడు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. వరదల కారణంగా గత 90 రోజులుగా ఆశించిన స్థాయిలో అవసరమైన మేరకు ఇసుకను తీయలేకపోయామని,
వచ్చే వారానికి వరదలు తగ్గే అవకాశం వున్నందున ఇసుక పంపిణీ వేగవంతమవుతుందని జగన్ అన్నారు. వరదలు తగ్గిన తర్వాత ఇసుక వారోత్సవం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వారోత్సవంలో భాగంగా వారం రోజులు ఇసుకమీదే పనిచేద్దామని సీఎం అధికారులకు సూచించారు. ఇసుక గురించి మళ్లీ ఎవ్వరూ మాట్లాడకుండా చూడాలని సీఎం అన్నారు.
దుష్ప్రచారాలను వెంటనే ఖండించండి: సీఎం జగన్
ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక వెళ్లకూడదని, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల వద్ద గట్టి పహరా ఉండాలని, డీజీపీ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించాలని జగన్ ఆదేశించారు. ఎంత బాగా చేస్తున్నా.. విమర్శలు వస్తున్నాయని, అందుకే వాటిపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు సూచించినట్లు సమాచారం. ఇంతకు ముందు అవినీతి, మాఫియాలతో ఇసుకను తరలించేవారని,
ఇప్పుడు ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి, అన్ని చోట్లా యంత్రాలు కాకుండా మాన్యువల్‌గా పనులు చేయాలని జగన్ ఆదేశించారు. దాని వల్ల భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని దొరుకుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. పనులు దొరకలేదన్న… ఇష్యూ ఇక్కడ తలెత్తదని, వరదలు తగ్గేలోగా వాగులు, వంకల్లో సుమారు 70 చోట్ల రీచ్‌లను గుర్తించాలని, గ్రామ సచివాలయంలో ఎవరైనా చలానా కట్టి, 20 కి.మీవరకూ ట్రాక్టర్ ద్వారా ఇసుక తరలించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.
