Honey Trap: ఒక్క ఫోన్‌ కాల్‌తో రూ.25 వేలు హాంఫట్‌.. వలపు వలలో చిక్కుకుని విల విల..

|

Jan 19, 2023 | 8:07 AM

రేడియాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి హనీ ట్రాప్‌లో చిక్కుకుని ఒక్క ఫోన్‌కాల్‌తో రూ.25 వేల మూల్యం చెల్లించుకున్నాడు. గురుగ్రామ్‌ సమీపంలోని సెక్టార్‌ 40లో బుధవారం (జనవరి 18)నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది..

Honey Trap: ఒక్క ఫోన్‌ కాల్‌తో రూ.25 వేలు హాంఫట్‌.. వలపు వలలో చిక్కుకుని విల విల..
Honey Trap
Follow us on

రేడియాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి హనీ ట్రాప్‌లో చిక్కుకుని ఒక్క ఫోన్‌కాల్‌తో రూ.25 వేల మూల్యం చెల్లించుకున్నాడు. గురుగ్రామ్‌ సమీపంలోని సెక్టార్‌ 40లో బుధవారం (జనవరి 18)నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఆసుపత్రిలో రేడియాలజిస్ట్‌ ఆన్‌లైన్‌లో కాల్ గర్ల్ కోసం వెతికే క్రమంలో జనవరి 7న ఓ నెంబర్‌కు ఫోన్‌ చేశాడు. అవతల ఫోన్ మాట్లాడిన వ్యక్తి తమ వద్ద అందమైన అమ్మాయిలు ఉన్నారంటూ ఊరించారు. దీంతో టెంప్ట్ అయిన అతగాడు కొంత మొత్తానికి డీల్ కుదుర్చుకున్నాడు. అతని ఫోన్‌కు లొకేషన్‌ షేర్‌ చేసి.. ఈ ప్రాంతంలో వేచి ఉండమని తెలిపారు. ఆ లొకేషన్‌కి నంబర్‌ ప్లేట్‌లేని ఓ కారులో అమ్మాయితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు చేరుకున్నారు. వారితోపాటు కారులో కూర్చున్న సదరు వ్యక్తి తన అకౌంట్‌ నుంచి రూ.25 వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అనంతరం మరో రూ.10 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేయవల్సిందిగా డిమాండ్‌ చేశారు. లేదంటే అత్యాచార కేసుపెడతామని బెదిరింపులకు దిగారు.

దీంతో బెంబేలెత్తిపోయిన బాధితుడు నగదు చెల్లించడానికి నిరాకరించాడు. దీంతో అతన్ని కారు నుంచి రోడ్డు పక్కన దింపివేసి పరారయ్యారు. దారుణంగా మోసపోయిన బాధితుడు ఆలస్యంగా పోలీసులను (జనవరి 17) ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పవన్, మోహిత్, సునీల్, దీప్షిక అనే నలుగురు నిందితులను బుధవారం సాయంత్రం అరెస్ట్‌ చేసి, బాధితుడి దగ్గర వసూలు చేసిన నగదును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే నిందితులు బెయిల్‌పై విడుదలవ్వడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.