Arvind Kejriwal: ఢిల్లీలో కేజ్రీవాల్‌ హవా.. బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన ఆప్‌.. 134 స్థానాల్లో విజయం..

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గత 15 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. తొలిసారి బీజేపీపై ఆప్‌ తిరుగులేని ఆధిక్యత సాధించింది. ఎంసీడీ ఎన్నికల ఫలితాలపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.

Arvind Kejriwal: ఢిల్లీలో కేజ్రీవాల్‌ హవా.. బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన ఆప్‌.. 134 స్థానాల్లో విజయం..
Arvind Kejriwal
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 07, 2022 | 3:32 PM

బీజేపీ కంచుకోటను ఆమ్‌ ఆద్మీ పార్టీ బద్దలు కొట్టింది. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ ఘన విజయం సాధించింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఢిల్లీలోని 250 వార్డుల్లో.. 134 స్థానాల్లో ఆప్‌ అభ్యర్ధులు తిరుగులేని మెజారిటీ సాధించారు. ఆప్‌కు గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందింది. అయితే గత 15 ఏళ్లుగా MCDలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆప్‌ గట్టి షాకిచ్చింది. 9 చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్ధులు గెలిచారు. మూడు స్థానాల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్ధులు విజయం సాధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరువాత మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా విజయం సాధించడంతో పార్టీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

250 వార్డుల్లో..

  • ఆప్‌ – 134
  • బీజేపీ – 104
  • కాంగ్రెస్‌ – 9
  • ఇండిపెండెంట్‌ అభ్యర్థులు – 3

ఆప్‌ ఘన విజయంతో.. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఎదుట సంబరాలు మిన్నంటాయి. సీఎం కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం సిసోడియా, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ పార్టీ కార్యాలయానికి చేరుకుని కార్యకర్తలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా ఆప్‌ కార్యాలయానికి చేరుకుని పార్టీ గెలుపు పట్ల సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

ఐ లవ్ యూ ఢిల్లీ.. కేజ్రీవాల్

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గత 15 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. తొలిసారి బీజేపీపై ఆప్‌ తిరుగులేని ఆధిక్యత సాధించింది. ఎంసీడీ ఎన్నికల ఫలితాలపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌. ఆప్‌ విజయం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఐ లవ్ యూ టూ ఢిల్లీ అని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలను అభినందిస్తున్నానని.. మార్పు తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలంటూ పేర్కొన్నారు.

ఢిల్లీ ఎంసీడీని అవినీతి రహితంగా మార్చేందుకు సహకరించాలని ప్రతిపక్ష పార్టీలకు, ప్రధాని నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఢిల్లీ కోసం పని చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ల సహకారం కావాలని కోరుకుంటున్నాని తెలిపారు. ఢిల్లీని బాగు చేసేందుకు కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతోపాటు.. ప్రధాని ఆశీస్సులు కోరుతున్నాననంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

బాధ్యత పెరిగింది..

దేశ రాజధాని వాసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా హిందీలో ట్వీట్ చేశారు. ఢిల్లీ MCD ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని విశ్వసించినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రజలు అతిపెద్ద పార్టీని ఓడించారు. నిజాయితీ గల అరవింద్ కేజ్రీవాల్ గెలుపును నిర్ధారించారు.. ఇది విజయం మాత్రమే కాదు, పెద్ద బాధ్యత అంటూ మనీష్ సిసోడియా పేర్కొన్నారు.

అన్ని అస్త్రాలు విఫలం..

బీజేపీ ప్రయోగించిన అన్ని అస్త్రాలు విఫలమయ్యాయని అన్నారు ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చడ్డా.. ఆప్‌ నేతలపై సీబీఐ , ఈడీ దాడులకు ఢిల్లీ ప్రజలు జవాబు ఇచ్చారని అన్నారు. సత్యేంద్రజైన్‌పై బీజేపీ విడుదల చేసిన వీడియోలను ఢిల్లీ ప్రజలు చెత్తబుట్టలో పడేశారని అన్నారు.

ఢిల్లీలో అతిపెద్ద పార్టీ బీజేపీ ఓడిపోయిందని, అతిచిన్న పార్టీ ఆప్‌ గెలిచిందని ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ పేర్కొన్నారు.

దేశ రాజధానిలోని 250 వార్డులకు డిసెంబర్ 4న ఎన్నికలు జరిగాయి. మొత్తం 1,349 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో మూడు పౌర సంస్థలు ఢిల్లీ కార్పొరేషన్ గా ఏకీకృతం అయిన తర్వాత ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. 2017లో 270 మునిసిపల్ వార్డులలో 181 మునిసిపల్ వార్డులను బిజెపి గెలుచుకుంది. అయితే అప్పుడు ఆప్ 48 మాత్రమే సొంతం చేసుకోగా.. కాంగ్రెస్ 30 స్థానాలతో మూడవ స్థానంలో నిలిచింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!