సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ, ఈడీ దూకుడు పెంచాయి. అరెస్ట్‌లు, దాడులతో స్కామ్‌లో హస్తం ఉన్నవారి గుండెల్లో సీబీఐ రైళ్లు పరుగెట్టిస్తుంది. ఇప్పటికే విజయ్‌నాయర్, సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొన్న ఢిల్లీలో అభిష్‌క్‌రావును సీబీఐ విచారించింది. నిన్న అరెస్టు చేసి ప్రత్యేక కోర్టు జడ్జి ముందు హాజరుపరిచింది. కీలక విషయాలు రాబట్టాలని.. అందుకోసం 5 రోజులు కస్డడీకి ఇవ్వాలని కోరింది. దీంతో 3 రోజుల కస్టడీకి సీబీఐ కోర్టు అనుమతించింది. అభిషేక్‌ను రెండవ రోజు విచారించిన అధికారులు కీలక విషయాలు వెల్లడించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అభిషేక్‌రావుకు సంబంధించిన కీలక విషయాలు సీబీఐ కస్టడీ రిపోర్టులో వెల్లడించాయి. అభిషేక్‌రావును 8సార్లు పిలిచి ప్రశ్నించిన సీబీఐ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఆయనకు లింకులు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్‌రావుది కీలకపాత్రని తేల్చింది. నేషనల్ మీడియా సెంటర్ యజమాని.. అర్జున్‌పాండేను నిందితుడిగా నిర్ధారించిన సీబీఐ.. విజయ్‌నాయర్ స్టేట్‌మెంట్ ఆధారంగా అభిషేక్ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్‌లో అభిషేక్‌రావుది కీలక పాత్రని తేల్చిచెప్పింది. సౌత్‌లాబీ పేరుతో.. ఇండో స్పిరిట్ యజమాని విజయ్‌నాయర్, దినేష్ అరోరాతో కలిసి అభిషేక్‌రావు కుట్ర చేసినట్లు సీబీఐ అధికారుల విచారణలో తేలింది. దీనికి సంబంధించి 2021 నవంబర్ నుంచి 2022 జులై వరకు.. పలు దఫాలుగా వీరు సమావేశమైనట్టు గుర్తించారు. రూ.3.80 కోట్లను అభిషేక్‌రావు 3 అకౌంట్ల ద్వారా.. షమీర్ మహేంద్రకు హవాలా రూపంలో ట్రాన్స్‌ఫర్ చేసినట్లు గుర్తించారు. వీరికి ఢిల్లీ పెద్దలు డబ్బులు పంపాలన్న ఒత్తిళ్లు వచ్చినట్లు సీబీఐ రిపోర్ట్ లో తేలింది. మరికొందరి పాత్రపై నిగ్గుతేల్చాల్సి ఉందని రిపోర్ట్ లో సీబీఐ తెలిపింది.
ఇక అభిషేక్ రావు అనుమానాస్పద లావాదేవీలు, సమీర్, విజయ్‌నాయర్‌తో సంబంధాలపై సుదీర్ఘంగా సీబీఐ ఆరాతీస్తోంది. విమాన టికెట్లు, హోటల్స్ బుకింగ్లకు సంబంధించిన ఆధారాలు అభిషేక్ రావు ముందు ఉంచి ఎంక్వైరీ చేస్తుంది. రేపు మూడోరోజు అభిషేక్ స్టేట్‌మెంట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలు రాబట్టాక మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం లేకపోదంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..