ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. నిందితుడిగా ఉన్న దినేశ్ అరోరా సీబీఐకి అప్రూవర్‌గా మారారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అరోరా అత్యంత సన్నిహితుడు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని , నవంబర్ 14న కోర్టులో స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు సిద్దమని తెలిపారు దినేశ్ అరోరా. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్‌ఆద్మీ పార్టీకి కష్టాలు మరింత పెరిగాయి. దినేశ్ అరోరా ఈ కేసులో అప్రూవర్‌గా మారారు.డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరోరా సన్నిహితుడు. కొద్దిరోజుల క్రితమే సీబీఐ కోర్టు దినేశ్ అరోరాకు లిక్కర్ స్కాం కేసులో ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. నవంబర్ 14వ తేదీన దినేష్ అరోరా స్టేట్‌మెంట్‌ను సీబీఐ కోర్టు రికార్డు చేయబోతోంది.
సీబీఐ దర్యాప్తుకు సహకరించానని , తాను చేసిన తప్పులను కోర్టుకు వెల్లడించేందుకు సిద్దంగా ఉన్నట్టు దినేశ్ అరోరా వెల్లడించారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని కూడా తెలిపారు. సీబీఐ తనపై ఒత్తిడి చేయలేదని వివరించారు. లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న దినేశ్ అరోరాను సీబీఐ విచారించింది. సీఎం కేజ్రీవాల్‌తో పాటు సిసోడియాకు దినేశ్ అరోరా చాలా సన్నిహితుడని బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఆరోపించారు. అతిత్వరలో లిక్కర్ స్కాంలో సిసోడియాను జైలుకు పంపడం ఖాయమన్నారు.
అరోరాకు చెందిన రాధా ఇండస్ట్రీస్‌కు మరో నిందితుడు సమీర్ మహేంద్రు బ్యాంక్ ఖాతా నుంచి కోటి రూపాయలు బదిలీ అయినట్టు సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దినేష్ అరోరా బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించలేదు. అక్రమంగా మద్యం లైసెన్స్‌లు జారీ చేసినట్టు కేసు నమోదు చేసిన సీబీఐ ఢిల్లీలో 35 ప్రాంతాల్లో సోదాలు చేసింది. డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు 14 మందిపై కేసులు నమోదయ్యాయి. కొత్త లిక్కర్ పాలసీతో ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..