ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌కు మరోసారి చుక్కెదురైంది. నవంబర్ 24న రోస్ అవెన్యూ కోర్టు నుంచి ఉపశమనం లభించలేదు. కోర్టు అతని జ్యుడీషియల్ కస్టడీని డిసెంబర్ 4 వరకు పొడిగించింది. ఆప్ నేత సంజయ్ సింగ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జైలులో ఎలక్ట్రిక్ కెటిల్ ఇవ్వడానికి కోర్టు అనుమతించింది. ఈ కేసులో సప్లిమెంటరీ చార్జిషీట్‌ను త్వరలో దాఖలు చేస్తామని ఈడీ తెలిపింది.
అక్టోబర్ 4న, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సంజయ్ సింగ్‌ను ED అతని అధికారిక నివాసంపై దాడి చేసింది. గంటల తరబడి విచారించిన తర్వాత అరెస్టు చేసింది. అనంతరం అక్టోబరు 5న న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. కస్టడీ తేదీ ముగిసిన తర్వాత సింగ్ చాలాసార్లు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కానీ అతనికి ఉపశమనం లభించలేదు.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో పలువురు డీలర్లకు లబ్ధి చేకూర్చేందుకు లంచాలు తీసుకున్నట్లు ఈడీ ఆరోపించింది. ఈ డబ్బును పార్టీ కోసం వినియోగించినట్లు పేర్కొంది. పాలసీలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం దానిని ఉపసంహరించుకుంది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని , ఓటమి భయం తోనే తనను ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయన్నారు సంజయ్ సింగ్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…