చార్ ధామ్, 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ధామ్ హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రం. కేదార్నాథ్ ను తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటారు. అయితే ఇప్పుడు కేదార్‌నాథ్ ఆలయం లాంటి మరొక ఆలయం నిర్మాణం జరుపుకోనుంది. ఈ క్షేత్రం దేశ రాజధాని ఢిల్లీలోని బురారీలో ఉంది. ఇప్పుడు ఢిల్లీలో కూడా కేదార్‌నాథ్ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ ఆలయ నిర్మాణంపై ఉత్తరాఖండ్ యాత్రికుల పూజారులు, సాధువులు విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణ వ్యవహారం ఇప్పుడు హిందువుల సంప్రదాయాలు, విశ్వాసాలను దాటి రాజకీయాల రూపం తీసుకుంది. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో నిర్మిస్తున్న కేదార్‌నాథ్ ఆలయ ట్రస్ట్ పేరు.. శ్రీ కేదార్‌నాథ్ ధామ్ ట్రస్ట్ బురారీ. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఆలయానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కొన్ని రోజుల క్రితం శంకుస్థాపన చేశారు.
ఇప్పుడు బాబా కేదార్‌నాథ్ పేరుతో నిర్మిస్తున్న మరో ఆలయంతో హిందువుల సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారని ఉత్తరాఖండ్ యాత్రికులు, సాధువులు అభివర్ణిస్తున్నారు. ఇలా చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. అయితే శ్రీ బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఈ మొత్తం వివాదానికి దూరంగా ఉంది. ఈ విషయంపై పుష్కర్ సింగ్ మాట్లాడుతూ ఢిల్లీలోని కేదార్‌నాథ్ ఆలయంతో తనకు గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
ఢిల్లీలో నిర్మిస్తున్న ఆలయం కేదార్‌నాథ్ ఆలయానికి ప్రతిరూపం మాత్రమే అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వాదించారు. ఉత్తరాఖండ్‌లో ఉన్న కేదార్‌నాథ్ ధామ్ మాత్రమే నిజమైన నివాసం అని చెప్పారు. ఢిల్లీలో ఈ ఆలయాన్ని సిద్ధం చేస్తున్న శ్రీ కేదార్‌నాథ్ ధామ్ ట్రస్ట్ ఈ విషయంపై మాట్లాడుతూ.. బురారీలో కేదార్‌నాథ్ ఆలయాన్ని మాత్రమే నిర్మిస్తున్నామని ఇది ధామ్ క్షేత్రం కాదని చెప్పారు. ఈ ఆలయ నిర్మాణంపై ప్రతి ఒక్కరికీ సొంత వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఇపుడు డిల్లీలో నిర్మిస్తున్న కేదార్‌నాథ్ ఆలయంపై సర్వత్రా అంటే చార్ ధామ్ భక్తుల నుంచి కేదార్ లోయ వరకు..ప్రజలలో విపరీతమైన కోపం వ్యక్తం చేస్తున్నారు.
బాబా కేదార్‌నాథ్ పేరుతో మరో ఆలయాన్ని నిర్మించడం హిందువుల విశ్వాసంతో ఆడుకుంటున్నారని సాధువులు అంటున్నారు. హిందూ సంప్రదాయాలను కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీటిని సహించేది లేదని కేదార్‌నాథ్ ధామ్ యాత్రికుడు సంతోష్ త్రివేది అన్నారు. అదే సమయంలో శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ ఢిల్లీలో నిర్మిస్తున్న ఆలయానికి తమ ట్రస్ట్ కు ఎటువంటి సంబంధం లేదని అన్నారు.
కేదార్నాథ్ ధామ్ తలుపులు 6 నెలల పాటు మూసి ఉంటాయని ఆలయాన్ని సిద్ధం చేసే శ్రీ కేదార్‌నాథ్ ధామ్ ట్రస్ట్, బురారీ వాదన. అందుకే ఆ 6 నెలల్లో బాబా కేదార్‌నాథ్ దర్శనం చేసుకునే అవకాశం భక్తులకు లభిస్తుంది. ఆర్గనైజింగ్ కమిటీ ఆహ్వాన పత్రం ఇవ్వడంతో వ్యవహారం ఊపందుకుంది. విరాళం కోసం క్యూఆర్ కోడ్ కూడా ఇందులో ఇన్‌స్టాల్ చేయబడింది. ఈ కోడ్‌పై విరాళాన్ని పంపిన తర్వాత ఖాతా కేదార్‌నాథ్ ధామ్ పేరుతో కనిపిస్తుంది. అందులో శివుడు, కేదార్‌నాథ్ ఆలయ చిత్రాలు ఉన్నాయి. దిగువన సురేంద్ర రౌతేలా చిత్రం కూడా ఉంది. ఢిల్లీ కేదార్‌నాథ్ ధామ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మరియు జాతీయ అధ్యక్షుడు పేరు QR కోడ్‌లో కనిపిస్తుంది.
దిగువ కుడివైపున ఈ ఆహ్వాన కార్డ్‌లో QR కోడ్ కూడా ఉంది. ఎవరైనా ఆలయ నిర్మాణానికి విరాళం ఇవ్వాలనుకుంటే ఈ QR కోడ్ ద్వారా డబ్బు పంపవచ్చు. ఈ QR కోడ్‌ని స్కాన్ చేస్తే, కేదార్‌నాథ్ ధామ్ పేరుతో ఒక ఖాతా కనిపిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..