ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. మహిళా నిందితులకు కన్యత్వ పరీక్ష రాజ్యాంగ విరుద్ధమంటూ ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. కన్యత్వ పరీక్షను నిర్వహించడం గౌరవ హక్కును ఉల్లంఘించడమే అంటూపేర్కొంది. కన్యత్వ పరీక్షకు ఎటువంటి శాస్త్రీయ, ప్రక్రియలేదని విధంగా పరీక్షంచడం అమానుషంగా వ్యవహరించడమేనని తెలిపింది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ మేరకు తీర్పును వెలువరించారు. 1992లో కేరళలో నన్ మృతికి సంబంధించి నమోదైన కేసులో నిందితురాలు సిస్టర్ సెఫీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది. దర్యాప్తులో భాగంగా నిర్బంధంలో ఉన్న మహిళకు, నిందితురాలుకు, జ్యుడిషియల్ కస్టడీ లేదా పోలీసు కస్టడీలో ఉన్న నిందితురాలికి కన్యత్వ పరీక్ష నిర్వహించడం రాజ్యాంగ వ్యతిరేకం, ఇలా చేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఉల్లంఘించడమే.. అంటూ జస్టిస్ శర్మ వెల్లడించారు.
కస్టడీలో ఉన్న మహిళా నిందితురాలికి అటువంటి పరీక్ష నిర్వహిస్తే మానవ హక్కులను ఉల్లంఘించడంగా పరిగణించాలని జస్టిస్ శర్మ పేర్కొన్నారు. ఒక వ్యక్తి నేరం చేసినట్లు ఆరోపణలు వచ్చినా లేదా అరెస్టు చేసినా నిందితుల గౌరవం పోదని పేర్కొన్న ధర్మాసనం.. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ చట్టం ద్వారా నిర్దేశించిన ప్రకారం న్యాయంగా ఉండాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
కాగా, 1992లో కేరళలో నన్ మృతికి సంబంధించిన కేసులో సీబీఐ దర్యాప్తు నేపంతో 2008లో తనకు కన్యత్వ పరీక్ష చేయించిందని, పరీక్ష ఫలితం లీక్ అయిందని పిటిషనర్ సెఫీ పిటిషన్‌లో ఆరోపించింది. పిటిషన్ విచారించిన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం కన్యత్వ పరీక్ష రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పునిచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం…