RTC Bus: మహిళా ప్రయాణికుల కోసం బస్సు ఆపలేదని డ్రైవర్‌ను సస్పెండ్‌ చేసిన సర్కార్.. బస్ డ్రైవర్లకు సీరియస్ వార్నింగ్

|

May 19, 2023 | 2:51 PM

బస్‌ కోసం బస్టాప్‌లో ఎదురు చూస్తున్న మహిళా ప్రయాణికుల కోసం బస్‌ ఆపనందుకు ఆ బస్‌ డ్రైవర్‌ను డిల్లీ ప్రభుత్వం గురువారం (మే 18) సస్పెండ్‌ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారం సర్కార్..

RTC Bus: మహిళా ప్రయాణికుల కోసం బస్సు ఆపలేదని డ్రైవర్‌ను సస్పెండ్‌ చేసిన సర్కార్.. బస్ డ్రైవర్లకు సీరియస్ వార్నింగ్
Delhi Govt Suspends Bus Driver
Follow us on

బస్‌ కోసం బస్టాప్‌లో ఎదురు చూస్తున్న మహిళా ప్రయాణికుల కోసం బస్‌ ఆపనందుకు ఆ బస్‌ డ్రైవర్‌ను డిల్లీ ప్రభుత్వం గురువారం (మే 18) సస్పెండ్‌ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారం సర్కార్ దృష్టికి వెళ్లడంతో బస్‌ డ్రైవర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని హెచ్చరిస్తూ సదరు డ్రైవర్‌ను సస్పెండ్‌ చేసినట్లు ప్రకటన వెలువరించింది.

ఆ వీడియోలో ముగ్గురు మహిళలు బస్ స్టాప్‌లో ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడి వచ్చిన బస్సు ఓ ప్రయాణికుడిని దించడానికి అగుతుంది. ఐతే అక్కడున్న ముగ్గురు మహిళలు బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా డ్రైవర్ బస్‌ ఆపకుండా వెంటనే వెళ్లి పోవడం వీడియోలో చూడవచ్చు. ఈ ఘటనలో సదరు బస్‌ డ్రైవర్‌ను సర్కార్ గుర్తించి సస్పెండ్‌ చేసింది. మహిళా ప్రయాణికుల కోసం కొందరు డ్రైవర్లు ఆగడం లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోషల్‌ మీడియా వేదికగా హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

‘ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్నందున డ్రైవర్లు మహిళలను చూసి కూడా బస్సులను ఆపడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. నిర్ణీత బస్‌స్టాప్‌లో బస్సు ఆపని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని’ సీఎం కేజ్రీవాల్ ట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి ట్వీట్‌ను రీ-ట్వీట్ చేస్తూ.. రవాణా మంత్రి కైలాష్ గహ్లోట్ మరో ట్వీట్‌ చేశారు. ఇలాంటి సంఘటనలను వీడియోలు తీసి ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రజలకు సూచించారు. అంతేకాకుండా బస్‌ ఆపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే బస్సు డ్రైవర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.