మన చుట్టూ పరిసరాల్లో ఏదైనా చిన్నపాటి యాక్సిడెంట్ జరిగితే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా చేయూత అందించేందుకు సిద్దమవుతాం. దీనినే మానవత్వం అంటారు. ఇది ప్రతి మనిషిలో ఏదో ఒక మూల పిసరంతైనా ఉంటుంది. కానీ ఢిల్లీలో దీనికి విరుద్దంగా ఒక దురాఘతం చోటు చేసుకుంది. ఒక ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, చిత్ర నిర్మాతకు రోడ్డుపై ప్రమాదం జరిగింది. గాయాలతో రక్తస్రావం అవుతోంది. అలాంటి పరిస్తితుల్లో మీరైతే ఏంచేస్తారు..? కచ్చితంగా అంబులెన్స్‌కి ఫోన్ చేస్తారు. ఆపదలో ఉన్న వారికి తోచినంత సాయం చేసి కొంతో గొప్పో పుణ్యం మూటగట్టుకుంటారు. కానీ ఢిల్లీలో దీనికి భిన్నంగా అమానవీయమైన సంఘటన చోటు చేసుకుంది. కొందరు దుండగులు అతని వద్ద ఉన్న నగదు, నగలు దోచుకునే ప్రయత్నం చేశారు. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వారి కథేందో ఒక సారి చూద్దాం.
ఢిల్లీ రోడ్లపై 30 ఏళ్ల ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ ప్రదర్శన చేపట్టింది. ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అతనికి తీవ్రమైన గాయం తగిలి రోడ్డుపై రక్తస్రావం జరుగుతోంది. అయినప్పటికీ చుట్టుపక్కలవారు అతనిని అస్సలు పట్టించుకోలేదు. పైగా అతని నిస్సహాయతను క్యాష్ చేసుకున్నారు. చుట్టూ చాలా మంది తిరుగుతూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఆతనిని కాపాడేందుకు సాహసించలేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కొంతమంది వ్యక్తులు ఈ సంఘటనను తమ మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేశారు. కానీ ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స కల్పించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పైగా కొందరు ఆవ్యక్తి నుంచి నగదు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న షాకింగ్ దృశ్యాలు సీసీటీవీ కెమరాల్లో రికార్డు అయ్యాయి. దాదాపు 30 నిమిషాల పాటు కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన యువ చిత్ర నిర్మాతను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. గురుగ్రామ్‌లో ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న పాల్ నడుపుతున్న బైక్, గురుగ్రామ్‌లో ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న బదర్‌పూర్ నివాసి బంటీ (26) నడుపుతున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. .బంటీ వాంగ్మూలంతో పాటూ సిసిటివి ఫుటేజీల ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం పరీక్ష నిర్వహించి అనంతరం మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించారు.
दक्षिणी दिल्ली में एक व्यक्ति की मोटरसाइकिल दूसरी बाइक से टकरा जाने से युवक की मौत हो गई व्यक्ति की पहचान एक डॉक्यूमेंट्री फिल्म निर्माता पीयूष पाल हुई pic.twitter.com/Ce7DP5HVT7
— Lavely Bakshi (@lavelybakshi) November 2, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..