AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Exit Poll Results 2025: ఢిల్లీ పీఠం ఆ పార్టీదే.. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలివే.. కేకే సర్వే రిపోర్ట్ ఏంటంటే..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ ఛానెల్స్‌ ఎగ్జిట్ పోల్స్‌ ప్రకటించాయి.. 2020 ఎన్నికలతో పోలిస్తే 13శాతం ఓటింగ్ పెరగడంతో.. ఇది గెలుపోటములపై ప్రభావం చూపనుందని పేర్కొంటున్నాయి.. ఈ సారి బీజేపీ, ఆప్ మధ్య గట్టి పోటీ ఉందని కొన్ని ఛానెళ్లు అంచనా వేశాయి.. మరికొన్ని.. బీజేపీకి అనుకూలంగా.. ఇంకొన్ని ఆప్ గెలిచే అవకాశం ఉందని పేర్కొన్నాయి.. 

Delhi Exit Poll Results 2025: ఢిల్లీ పీఠం ఆ పార్టీదే.. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలివే.. కేకే సర్వే రిపోర్ట్ ఏంటంటే..
Delhi Exit Poll Results 2025
Shaik Madar Saheb
|

Updated on: Feb 05, 2025 | 7:08 PM

Share

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.. సీలంపూర్‌, జంగ్‌పూర్‌, అకోలా నియోజకవర్గాలు మినహా మిగతా ప్రాంతాల్లో ప్రశాంతంగా ముగిసింది. కాగా.. సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. పలు నియోజకవర్గాల్లో ఆప్‌, బీజేపీ అభ్యర్ధుల మధ్య టఫ్‌ ఫైట్‌ ఉంది. గెలుపుపై అటు బీజేపీ, ఇటు ఆప్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తున్నట్లు పేర్కొంటున్నారు. కాగా.. ఢిల్లీలో అంచనాలను మించి పోలింగ్‌ శాతం నమోదవడంతో.. అంచనాల్లో పార్టీలు తలమునకలవుతున్నాయి. 2020 ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 44.52 శాతం పోలింగ్‌ నమోదైంది.. 2025లో సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్… గత ఎన్నికలతో పోలిస్తే 13 శాతం పోలింగ్‌ పెరిగింది.. పెరిగింది అనుకూల ఓటా..? ప్రతికూల ఓటా..? అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అంచనావేస్తున్నాయి.. ఈ క్రమంలోనే పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలయ్యాయి..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ ఛానెల్స్‌ ఎగ్జిట్ పోల్స్‌ ప్రకటించాయి.. 2020 ఎన్నికలతో పోలిస్తే 13శాతం ఓటింగ్ పెరగడంతో.. ఇది గెలుపోటములపై ప్రభావం చూపనుందని పేర్కొంటున్నాయి.. ఈ సారి బీజేపీ, ఆప్ మధ్య గట్టి పోటీ ఉందని కొన్ని ఛానెళ్లు అంచనా వేశాయి.. మరికొన్ని.. బీజేపీకి అనుకూలంగా.. ఇంకొన్ని ఆప్ గెలిచే అవకాశం ఉందని పేర్కొన్నాయి..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు ఇవే..

మ్యాట్రిజ్‌ – ఆప్‌ 32-37, బీజేపీ 35-40, కాంగ్రెస్‌ 0-1 స్థానాలు

పీపుల్స్ ఇన్‌సైట్- ఆప్‌ 25-29, బీజేపీ 40-44, కాంగ్రెస్0-1 స్థానాలు

రిపబ్లిక్‌ పీమార్క్‌- ఆప్‌ 21-31, బీజేపీ 39-49, కాంగ్రెస్ 0-1 స్థానాలు

కేకే సర్వే: ఆప్ 39, బీజేపీ 22, కాంగ్రెస్ 9స్థానాలు

టైమ్స్‌నౌ: ఆప్ 22-31, బీజేపీ 39-45, కాంగ్రెస్‌ 0-2

పీపుల్స్‌ పల్స్‌: ఆప్‌ 10-19, బీజేపీ 51-60

చాణక్య స్ట్రాటజీస్: బీజేపీ 39-44 స్థానాలు, ఆప్‌ 25-28, కాంగ్రెస్ 2-3

జేవీసీ ఎగ్జిట్‌పోల్: బీజేపీ 39-45 స్థానాలు, ఆప్ 22-31, కాంగ్రెస్ 0-2

అయితే.. ఢిల్లీ ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకారం.. బీజేపీకే స్పష్టమైన ఆధిక్యం కన్పిస్తోంది. 25 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నాయి. ఓట్ల శాతం పెరగడంతో బీజేపీకి అనుకూలంగా ఉంటుందన్న భావన కన్పిస్తోంది. ఢిల్లీ మొత్తం 70 స్థానాలు కాగా మెజారిటీ దక్కాలంటే 36 స్థానాలు దక్కాలి. పోల్‌ ఆఫ్‌ పోల్స్‌లో కూడా బీజేపీకే ఆధిక్యం లభించింది.

వీడియో చూడండి..

Follow Us
మద్యం సేవించొద్దన్నందుకు..అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు
మద్యం సేవించొద్దన్నందుకు..అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు
భారీగా కుప్పకూలిన వెండి ధరలు.. ఒకేసారి ఎంతో తెలుసా..?
భారీగా కుప్పకూలిన వెండి ధరలు.. ఒకేసారి ఎంతో తెలుసా..?
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది
ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్
ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్
ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?
ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌
CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌
ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ
ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ
పాన్ కార్డు అసలైందా..? కాదా? ఈ ట్రిక్‌తో గుర్తు పట్టేయండి..
పాన్ కార్డు అసలైందా..? కాదా? ఈ ట్రిక్‌తో గుర్తు పట్టేయండి..