ECI: అసెంబ్లీ ఎన్నికలపై సీఈసీ ఫోకస్.. రాష్ట్రాలకు సీఈవోలకు కీలక ఆదేశాలు..

|

Jun 03, 2023 | 4:41 AM

తెలంగాణ సహా ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ఫోకస్‌ పెట్టింది సీఈసీ. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారుల నియామకంపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం, చత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లకు.. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నరేంద్ర ఎన్‌. బుటోలియా లేఖ రాశారు.

ECI: అసెంబ్లీ ఎన్నికలపై సీఈసీ ఫోకస్.. రాష్ట్రాలకు సీఈవోలకు కీలక ఆదేశాలు..
Election Commission Of Indi
Follow us on

తెలంగాణ సహా ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ఫోకస్‌ పెట్టింది సీఈసీ. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారుల నియామకంపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం, చత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లకు.. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నరేంద్ర ఎన్‌. బుటోలియా లేఖ రాశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల నియామకంలో పాటించాల్సిన నిబంధనల్ని లేఖలో పేర్కొన్నారు.

సొంత జిల్లాల్లో అధికారులకు పోస్టింగులు వేయరాదనీ.. మూడేళ్లు ఒకేచోట పనిచేసిన వారిని వెంటనే బదిలీ చేయాలని ఆదేశించింది ఈసీ. గడచిన నాలుగేళ్లలో మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న అధికారులెవ్వరూ.. అదే స్థానంలో కొనసాగరాదని స్పష్టం చేసింది. పదోన్నతి పొంది అదే జిల్లాలో కొనసాగుతున్నప్పటికీ మూడేళ్ల పదవీకాలం నిబంధన వర్తిస్తుందని తేల్చి చెప్పింది ఈసీ.

డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, రెవెన్యూ ఉన్నతాధికారులు, ఎన్నికల విధులు చూసే నోడల్ అధికారులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, బ్లాక్ డెవలప్మెంట్ అధికారులతో పాటు.. ఆ స్థాయి సమాన హోదా కల్గిన అధికారులందరూ ఈసీ చెప్పిన జాబితాలో ఉన్నారు. పోలీసు విభాగంలోనూ రేంజ్ ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు, కమాండెంట్లు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు సహా సమాన హోదా కల్గిన ఇతర అధికారులంతా ఈసీ ఉత్తర్వుల పరిధిలోకి రానున్నారు. సొంత జిల్లాల్లో ఉన్న అధికారులతో పాటు.. మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేసి.. ఆ వివరాలను జులై 31 నాటికి సమర్పించాలని ఆదేశించింది ఈసీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..