Watch Video: ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న మంత్రి.. చివరకు ఇద్దరూ కలిసి.. మామూలు ట్విస్ట్ కాదుగా..
ఒక ఎమ్మెల్యే.. ఒక మంత్రిని రిక్వెస్ట్ చేసినా, డిమాండ్ చేసినా రొటీన్. కానీ ఒక ఎమ్మెల్యే కాళ్లను- రాష్ట్ర మంత్రి మొక్కడం ఎలా ఉంటుంది? ఢిల్లీలో అచ్చంగా ఇదే జరిగింది. ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్, బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా కాళ్లపై పడ్డారు. ఎమ్మెల్యే కదలకుండా కాళ్లను గట్టిగా పట్టుకున్నారు.
ఒక ఎమ్మెల్యే.. ఒక మంత్రిని రిక్వెస్ట్ చేసినా, డిమాండ్ చేసినా రొటీన్. కానీ ఒక ఎమ్మెల్యే కాళ్లను- రాష్ట్ర మంత్రి మొక్కడం ఎలా ఉంటుంది? ఢిల్లీలో అచ్చంగా ఇదే జరిగింది. ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్, బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా కాళ్లపై పడ్డారు. ఎమ్మెల్యే కదలకుండా కాళ్లను గట్టిగా పట్టుకున్నారు. మార్షల్స్ పునరుద్ధరణ కోసం లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్లాలని కోరారు. వెంటనే మంత్రి తన కాళ్లమీద పడటంతో, ఎమ్మెల్యే షాక్ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కారులోనే మంత్రి భరద్వాజ్, LG దగ్గరకు వెళ్లారు. ఢిల్లీలోని బస్సుల్లో మార్షల్స్‌ను పునరుద్ధరించాలంటూ ఆమ్‌ఆద్మీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి ఎమ్మెల్యే కాళ్లు పట్టుకోని లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది..
ప్యాసింబర్ బస్సుల్లో ప్రయాణికుల రక్షణ కోసం ఢిల్లీ ప్రభుత్వం – సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ అనే వ్యవస్థను రూపొందించింది. ఒక్కో బస్సులో ఒక్కో మార్షల్ ఉంటారు. ఇలా 10వేల మంది మార్షల్స్ అందుబాటులో ఉన్నారు. అయితే, ఆర్థిక భారం అవుతోందంటూ LG ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీనిపైనే రోజుకోరకంగా ఆమ్‌ఆద్మీ ఆందోళన చేస్తోంది.
ఈ ఘటనతో ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ నేతల రూటే వేరు. పరిపాలన, ఆందోళన, డ్రామా.. వీటన్నిటిలోనూ చీపురుపార్టీ స్టయిలే వేరంటూ చర్చ జరుగుతోంది..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..