Rs 2000 Note: ‘నోట్ల మార్పిడి’ కేసును కొట్టేసిన ఢిల్లీ హైకోర్ట్.. చట్టబద్ధమైన చర్య మాత్రమే అంటూ..

|

May 29, 2023 | 1:54 PM

₹2000 Currency Withdrawal: ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2,000 కరెన్సీ నోట్ల మార్పిడికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్‌ను ఢిలీ హైకోర్టు తిరస్కరించింది. 2 వేల రూపాయల నోట్లు మార్చుకునేందుకు రిక్విజిషన్ స్లిప్ లేదా ఐడీ ప్రూఫ్..

Rs 2000 Note: ‘నోట్ల మార్పిడి’ కేసును కొట్టేసిన ఢిల్లీ హైకోర్ట్.. చట్టబద్ధమైన చర్య మాత్రమే అంటూ..
Delhi High Court Of 2000 Currency Withdrawal
Follow us on

₹2000 Currency Withdrawal: ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2,000 కరెన్సీ నోట్ల మార్పిడికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్‌ను ఢిలీ హైకోర్టు తిరస్కరించింది. 2 వేల రూపాయల నోట్లు మార్చుకునేందుకు రిక్విజిషన్ స్లిప్ లేదా ఐడీ ప్రూఫ్ తప్పనిసరి చేయాలంటూ అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ వేశారు. ఈ మేరకు మే 23న విచారణ జరిపి సోమవారానికి వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ సతీష్ కుమార్ శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ రోజు దాన్ని కొట్టివేసింది.

అయితే వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, మావోయిస్టులు, డ్రగ్స్ స్మగ్లర్లు, మైనింగ్ మాఫియా వంటి ఇతర అవినీతిపరులు నిల్వ చేసిన నోట్ల కారణంగా చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 3.11 లక్షల కోట్లు పడిపోయిందని ఉపాధ్యాయ్ తన పిటీషన్‌లో పేర్కొన్నారు. నోట్లు మార్చుకోవడానికి ఆర్‌బీఐ, ఎస్‌బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌లు ఏకపక్షంగా, అహేతుకంగా ఉన్నాయని, రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘిస్తున్నాయని ఆయన తన పిటిషన్‌ ద్వారా తెలిపారు.

ఇంకా గ్యాంగ్‌స్టర్లు, మాఫియా, వారి సహచరులు ఎటువంటి అధికారిక డాక్యుమెంటేషన్ లేదా రికార్డ్ కీపింగ్ లేకుండా తమ నోట్లను మార్చుకోవడానికి ఈ నోటిఫికేషన్లు వీలు కల్పిస్తున్నాయని నమ్ముతున్నందున ‘ఐడీ ప్రూఫ్ లేకుండా’ అనే దాన్ని తాను వ్యతిరేకించానని వాదించాడు.  కాగా, ఉపాధ్యాయ్ పిటీషన్‌పై విచారించిన హైకోర్టు RBI విడుదల చేసిన నోటిఫికేషన్‌ను సమర్థించింది. ఇది పెద్ద నోట్ల రద్దు కాదని కేవలం చట్టబద్ధమైన చర్య అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.