Delhi: కేంద్రంలో అంతా నిరక్షరాస్యులే.. బీజేపీపై మండిపడ్డ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌..

|

Mar 21, 2023 | 10:12 PM

ఢిల్లీ బడ్జెట్‌పై ఉత్కంఠ వీడింది. బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి లభింయింది. చివరిక్షణంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి కేంద్రం అనుమతి ఇవ్వడంపై

Delhi: కేంద్రంలో అంతా నిరక్షరాస్యులే.. బీజేపీపై మండిపడ్డ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌..
Arvind Kejriwal
Follow us on

ఢిల్లీ బడ్జెట్‌పై ఉత్కంఠ వీడింది. బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి లభింయింది. చివరిక్షణంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి కేంద్రం అనుమతి ఇవ్వడంపై సీఎం కేజ్రీవాల్‌ మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వంలో పైనుంచి కిందివరకు అంతా చదువురానివాళ్లే ఉన్నారంటూ ఢిల్లీ CM అరవింద్‌ కేజ్రీవాల్‌ శివాలెత్తిపోయారు. బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలకు 20వేల కోట్లు కేటాయించి, ప్రచారానికి 500 కోట్లను తాము కేటాయించామన్నారు. అయితే 20వేల కోట్లకంటే 500 కోట్లే తక్కువ అనేలా కేంద్రం మాట్లాడిందని అసెంబ్లీలో ఎద్దేవా చేశారు. నేను మీ నాయకుడి పేరు చెప్పలేదంటూ BJP సభ్యులను ఉద్దేశించి కేజ్రీవాల్‌ అనగానే, సభ్యులంతా గొల్లున నవ్వారు.

ఢిల్లీ అసెంబ్లీలో బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు సీఎం కేజ్రీవాల్‌. అయితే బడ్జెట్‌కు చివరిక్షణంలో కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది ఆమ్‌ఆద్మీ పార్టీ . ప్రచారం కోసం తాము అధిక నిధులు కేటాయించినట్టు తప్పుడు ఆరోపణలు చేసి బడ్జెట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు మండిపడ్డారు కేజ్రీవాల్‌. ఢిల్లీ అభివృద్దిని అడ్డుకోవడం తగదన్నారు.

ఇవి కూడా చదవండి

కేజ్రీవాల్‌ ప్రసంగం సందర్భంగా బీజేపీ సభ్యులు ఆందోళన చేసే ప్రయత్నం చేశారు . బీజేపీ ఎమ్మెల్యే విజేంద్రగుప్తాను స్పీకర్‌ ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..