Delhi: తీహార్‌కు జైలుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ముగిసిన బెయిల్ గడువు

|

Jun 02, 2024 | 3:54 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మళ్లీ తీహార్‌కు జైలుకు వెళ్లారు. అయితే జైలుకు వెళ్లే ముందు రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్ముడికి ఘన నివాళి అర్పించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఆయన తిరిగి జైలుకు వెళ్లారు. ఈ క్రమంలో తన మంత్రి వర్గం కూడా రాజ్ ఘాట్ వరకు వచ్చి కేజ్రీవాల్‎తోపాటు నివాళులు అర్పించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మూడు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది.

Delhi: తీహార్‌కు జైలుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ముగిసిన బెయిల్ గడువు
Delhi Cm Kejriwal
Follow us on

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మళ్లీ తీహార్‌కు జైలుకు వెళ్లారు. అయితే జైలుకు వెళ్లే ముందు రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్ముడికి ఘన నివాళి అర్పించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఆయన తిరిగి జైలుకు వెళ్లారు. ఈ క్రమంలో తన మంత్రి వర్గం కూడా రాజ్ ఘాట్ వరకు వచ్చి కేజ్రీవాల్‎తోపాటు నివాళులు అర్పించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మూడు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తిరిగి ఆయన జూన్ 2న మధ్యాహ్నం 3 గంటలకు జైలుకు వెళ్లారు. అయితే కన్నాట్ ప్రాంతంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి.. స్వామి వారి ఆశీర్వాదానంతరం పార్టీ ఆఫీసుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. తన పార్టీ ఆఫీసులోని ముఖ్య శ్రేణులను కలిసి వారితోపాటు రాజ్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పించిన తరువాత తీహార్ జైలుకు వెళ్తానని ఎక్స్ వేదికగా కేజ్రీవాల్ స్పందించారు.

మార్చి 21వ తేదీన మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. అయితే ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు మరో వారం రోజులు మధ్యంతర బెయిల్ గడువు పెంచాలని కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు విముఖత చూపించింది సుప్రీం కోర్టు. స్థానిక కోర్టులను ఆశ్రయించాలని కోరారు రిజిస్ట్రార్. దీంతో వెంటనే.. రౌస్ అవెన్యూ కోర్టులో మధ్యంతర, సాధారణ బెయిల్ ఇవ్వాలని రెండు పిటిషన్లు దాఖలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌. కేజ్రీవాల్ పిటిషన్లను స్వీకరించిన సీబీఐ ప్రత్యేక కోర్టు వాదనలు విన్న తరువాత ఉత్తర్వులు వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులు జూన్ 5కి వాయిదా పడింది. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నడుచుకుంటామని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..