Train Accident: విజయనగరం రైలు ప్రమాదంపై స్పందించిన కేజ్రీవాల్‌.. ఇలా జరగడం ఆందోళ కలిగిస్తోందంటూ..

విశాఖపట్నం నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉన్న సయంలో.. దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు.. ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టింది. ప్రమాద ధాటికి మొత్తం మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ రైలు ప్రమాదంపై రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు స్పందిస్తున్నారు...

Train Accident: విజయనగరం రైలు ప్రమాదంపై స్పందించిన కేజ్రీవాల్‌.. ఇలా జరగడం ఆందోళ కలిగిస్తోందంటూ..
Delhi Cm Arvind Kejriwal

Updated on: Oct 30, 2023 | 9:12 AM

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం పెను విషాధాన్ని మిగిల్చింది. కొద్ది నెలల క్రితం ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన రైలు ప్రమాదాన్ని తలపిస్తున్న ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది మరణించగా, 100 మందికిపైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

విశాఖపట్నం నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉన్న సయంలో.. దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు.. ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టింది. ప్రమాద ధాటికి మొత్తం మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ రైలు ప్రమాదంపై రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు స్పందిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, పలువురు రాజకీయ ప్రముఖులు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్…

ట్విట్టర్‌ వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ రైలు ప్రమాదం చాలా బాధకరం. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. దేశంలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది’ అని రాసుకొచ్చారు.

నవీన్ పట్నాయక్ ట్వీట్..

ఇక ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సైతం రైలు ప్రమాదంపై స్పందించారు. ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం చాలా బాధాకరం. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరలో కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తునున్నాను’ అని రాసుకొచ్చారు.

ఇదిలా ఉంటే రైలు ప్రమాదంలో మరణించిన వారికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఏపీకి చెందిన మరణించిన వారికి రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన మరణించిన వారికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున సహాయం అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం మరణించిన వారికి రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున సహాయం అందించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..