Punjab: అయ్యయ్యో.. ఎంత దారుణం..అందరూ చూస్తుండగానే..! వైరల్ వీడియో.
పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. దుకాణం ముందు కూర్చున్న ఓ వ్యక్తిపై కొందరు తుపాకితో కాల్పులు జరిపారు. దుకాణంలోని సిబ్బంది వచ్చిచూసేసరికి దుండగులు పారిపోగా.. చికిత్స పొందుతూ షాపు యజమాని మృతి చెందాడు. భటిండాలోని హర్జిందర్ సింగ్ జోహాల్ అనే వ్యక్తి అమృత్‌సరి కుల్చా షాపును నిర్వహిస్తున్నాడు. రోజూలాగే దుకాణానికి వచ్చిన ఆయన ఆరుబయట షాపు ముందు కుర్చీలో కూర్చుని ఫోన్ చూసుకుంటున్నారు. ఇంతలో బైక్‌పైన వచ్చిన దుండగులు అతనిపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. జోహాల్ గట్టిగా […]
పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. దుకాణం ముందు కూర్చున్న ఓ వ్యక్తిపై కొందరు తుపాకితో కాల్పులు జరిపారు. దుకాణంలోని సిబ్బంది వచ్చిచూసేసరికి దుండగులు పారిపోగా.. చికిత్స పొందుతూ షాపు యజమాని మృతి చెందాడు. భటిండాలోని హర్జిందర్ సింగ్ జోహాల్ అనే వ్యక్తి అమృత్‌సరి కుల్చా షాపును నిర్వహిస్తున్నాడు. రోజూలాగే దుకాణానికి వచ్చిన ఆయన ఆరుబయట షాపు ముందు కుర్చీలో కూర్చుని ఫోన్ చూసుకుంటున్నారు. ఇంతలో బైక్‌పైన వచ్చిన దుండగులు అతనిపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. జోహాల్ గట్టిగా కేకలు వేయడంతో షాపులో పనిచేస్తున్న సిబ్బంది బయటకు వచ్చి దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ దుండగులు పారిపోవడంతో.. వెనుదిరిగి యజమానిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ జోహాల్ మృతి చెందారు. ఈ ఘటనపై జోహాల్ షాపులో పనిచేసే వర్కర్ స్పందిస్తూ.. కాల్పుల శబ్దం విని తొలుత టపాసులు అనుకున్నానని పేర్కొన్నాడు. ఆ వెంటనే జోహాల్ గట్టిగా అరుస్తూ తనపై కాల్పులు జరుపుతున్నారని, వారిని పట్టుకోవాలని కేకలు వేశారని చెప్పాడు. తాను వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయారని తెలిపాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ టీవీలో రికార్డయ్యాయి. నిందితులను గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై తర్వాత విపక్ష పార్టీ నేతలు భగవంత్‌మాన్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుక్వీర్ సింగ్ బాదల్ ఆరోపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..