ఢిల్లీ బాంబు పేలుడు కేసులో వెలుగులోకి సంచలనం.. విషయం తెలిసి అంతా షాక్!
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు కేసులో NIA దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. కారు బాంబు పేలుడు కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు , ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు అరెస్టయిన నిందితులు NIA విచారణ అధికారులకు వెల్లడించారు.

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు కేసులో NIA దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. కారు బాంబు పేలుడు కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు , ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు అరెస్టయిన నిందితులు వెల్లడించారు
ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో కీలక నిందితుడు ముజమ్మిల్‌ను ఫరీదాబాద్ లోని అల్ ఫలా యూనివర్సిటీకి తీసుకొచ్చారు . సీన్‌ను రీకన్‌స్ట్రక్ట్ చేశారు అధికారులు. సూసైడ్ బాంబర్ ఉమర్‌తో కలిసి ఢిల్లీలో పలు చోట్ల బాంబుదాడులకు కుట్ర చేశాడు ముజమ్మిల్. ఉమర్‌తో పాటు ముజమ్మిల్ కూడా అల్ ఫలా యూనివర్సిటీ లోనే చదువుకున్నాడు. ఉగ్రదాడికి స్కెచ్ గీశాడు. ఫరీదాబాద్ లోని ధోజ్, ఫతేపూర్, టాగా గ్రామాల్లో ముజిమ్మిల్ పేలుడు పదార్ధాలను నిల్వ ఉంచినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
మెడికల్ కాలేజ్ హాస్టల్ లోని ముజిమ్మిల్ గదిని NIA అధికారులు పరిశీలించారు. మూడున్నర గంటల పాటు విచారణ కొనసాగింది. అల్ ఫలా యూనవర్సిటీలో అండర్ గ్రౌండ్ మదరాసాను కూడా నిర్మించాడు ముజమిల్. అతడికి సహకరించిన డాక్టర్లను కూడా NIA ప్రశ్నించింది. ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితురాలిగా ఉన్న డాక్టర్ షహీన్‌ను కూడా లక్నో తీసుకొచ్చి సీన్ రీకన్‌స్ట్రక్ట్ చేసే ఆలోచనలో NIA అధికారులు ఉన్నారు. డాక్టర్ ముజామ్మిల్ ప్రస్తుతం 10 రోజుల NIA కస్టడీలో ఉన్నారు.
ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడులో 15 మంది చనిపోగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. అల్ ఫలా యూనివర్పిటీ కేంద్రంగా ఢిల్లీ పేలుడుకు కుట్ర జరిగిందని ఇప్పటికే దర్యాప్తులో తేలింది. విచారణలో అరెస్టయిన ఉగ్రవాదుల నుంచి దర్యాప్తు అధికారులు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆత్మాహుతి చేసుకున్న ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీ.. 2016లో సైన్యం చేతిలో హతమైన బుర్హాన్ వానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని చూశాడని తేలింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
