Delhi Baba: ఢిల్లీ బాబా కథలు చూడతరమా..! ప్రధాని మోదీ, బారక్‌ ఒబామాను కూడా వదల్లేదు..

ఢిల్లీ బాబా చైతన్యనంద సరస్వతి లైంగిక వేధింపులు, నకిలీ పత్రాలతో ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వసంత కుంజ్ ఆశ్రమంలో 17 మంది మహిళలను వేధించారని, మోడీ, ఒబామాలతో ఎడిట్ చేసిన ఫొటోలు, యూఎన్, బ్రిక్స్ ఫేక్ ఐడీలు దొరికాయి.

Delhi Baba: ఢిల్లీ బాబా కథలు చూడతరమా..! ప్రధాని మోదీ, బారక్‌ ఒబామాను కూడా వదల్లేదు..
Delhi Baba

Updated on: Oct 01, 2025 | 7:18 PM

ఢిల్లీ నగరంలోని వసంత కుంజ్ ప్రాంతంలోని ఒక ఆశ్రమంలో 17 మంది మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒడిశాకు చెందిన ‘స్వామి చైతన్యానంద సరస్వతి’ కథలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ పోలీసులు బుధవారం అతని ఆశ్రమం నుంచి మూడు నకిలీ ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు.

ఎడిట్‌ చేసిన ఫొటోల్లో ‘ఢిల్లీ బాబా’ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఒక రాజకీయ నాయకుడితో కలిసి ఉన్నట్లు ఉంది. ఆశ్రమంలోని అతని గదిలో ఈ ఫొటోలు దొరికాయి. అతన్ని ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలికి శాశ్వత రాయబారిగా, బ్రిక్స్ కూటమికి ప్రత్యేక రాయబారిగా గుర్తించే ఫేక్‌ ఐడీ కార్డులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

8 కోట్ల విలువైన ఆస్తులు సీజ్‌..

పోలీసులు అశ్లీల విషయాలు ఉన్న ఐదు సిడిలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గత వారం అతని బండారం బయటపడిన తర్వాత అరెస్టు నుండి తప్పించుకోవడానికి ‘ఢిల్లీ బాబా’ దాక్కున్న ఉత్తరాఖండ్‌లోని అల్మోరా, బాగేశ్వర్‌లలోని ప్రదేశాలను కూడా ప్రత్యేక పోలీసు బృందం సందర్శించింది. ఆగస్టు 4న మొదటి ఫిర్యాదు వచ్చినప్పటి నుండి 50 రోజులుగా పరారీలో ఉన్న అతన్ని ఆగ్రాలోని తాజ్ గంజ్‌లోని ఒక హోటల్‌లో పట్టుకుని అరెస్టు చేశారు.

అరెస్టు సమయంలో ప్రైవేటుగా నిర్వహించబడుతున్న విద్యా సంస్థ శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ ప్రాంగణాన్ని పర్యవేక్షించే సిసిటివి కెమెరాలకు లింక్‌ అయిన మొబైల్ ఫోన్‌తో సహా పలు డిజిటల్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనను తాను ఇన్స్టిట్యూట్ కి ‘డైరెక్టర్’ అని చెప్పుకునే బాబా, మహిళలను వేధించాడని, వారిని లైంగికంగా బలవంతంగా లైంగికంగా వేధించాడని, మొదట ఒప్పించి, తరువాత మార్కులు ఇవ్వకుండా బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి