ప్రమాదపుటంచుల్లో దేశ రాజధాని.. టెర్రర్ ఫోర్‌హండ్రెడ్… ఇన్ ఢిల్లీ!
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100లోపు ఉంటే గాలి నాణ్యత బాగున్నట్టు. వాయు కాలుష్యం లేనట్లు. మరి, ఇప్పుడు దేశరాజధాని ఢిల్లీలో ఆ నంబర్ 400 దాటింది. అంటే నాలుగింతలు పెరిగింది. దీపావళి ముగిసేలోగా మరింత విషమించే అవకాశముందట. ఢిల్లీ జనాభా పరిస్థితి ఏంటో ఊహించడమే కష్టం.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100లోపు ఉంటే గాలి నాణ్యత బాగున్నట్టు. వాయు కాలుష్యం లేనట్లు. మరి, ఇప్పుడు దేశరాజధాని ఢిల్లీలో ఆ నంబర్ 400 దాటింది. అంటే నాలుగింతలు పెరిగింది. దీపావళి ముగిసేలోగా మరింత విషమించే అవకాశముందట. ఢిల్లీ జనాభా పరిస్థితి ఏంటో ఊహించడమే కష్టం.
ప్రతీ దీపావళి లాగే ఈసారి కూడా దేశ రాజధానికి పొల్యూషన్ గండం పట్టుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్క్‌ను క్రాస్ చేసింది. ఇది అత్యంత తీవ్రమైన కాలుష్య కేటగిరీ. AQI లెవల్ 400-500 మధ్య ఉంటే గాలికాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్నట్లు లెక్క. అక్షరధామ్ ప్రాంతంలో వాయు నాణ్యత 426గా నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే హయ్యస్ట్ పొల్యూషల్ లెవల్. 418 ఏక్యూఐతో ఆనంద్ విహార్ ప్రాంతం తర్వాతి స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో శ్వాస తీసుకోవడం అంటే, రోజుకు ఆరు సిగరెట్లు తాగినంత ప్రమాదకరం.
గాలిలో దుమ్ము ధూళి కణాలు పెరిగి, విజిబులిటి తగ్గి, ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగాయి. పైగా, దగ్గు, కళ్ల మంటలు, గొంతునొప్పితో అవస్థలు పడుతున్నారు. మాస్క్ పెట్టుకుంటే తప్ప బైటికి వెళ్లే సాహసం చేయడం లేదు. వింటర్ సీజన్ సమీపించడం, వాహన ఉద్గారాలు పెరగడం, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం లాంటివన్నీ ఎయిర్ పొల్యూషన్ తీవ్రతకు ప్రధాన కారణాలుగా తేల్చారు అధికారులు.
ఇటు, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుతో పాటు ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. AQI లెవల్ ప్రమాదకరస్థితిలో ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపట్టింది. జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ఇండియా గేట్ లాంటి ఏరియాల్లో వాటర్ స్ప్రింక్లర్లను మోహరించి, గాల్లో దుమ్ముధూళిని తగ్గించి, కాలుష్యాన్ని కట్టడి చేస్తున్నారు. డీజిల్ జెనరేటర్లు, ఆరుబయట కట్టెల పొయ్యి లాంటివన్నీ నిషేధించారు. నిర్మాణంలో ఉన్న కట్టడాల్ని మూసివేశారు.
కానీ, దీపావళి సందర్భంగా 18 నుంచి 21 వరకు నాలుగురోజుల పాటు టపాకాయలు కాల్చుకునేందుకు ఢిల్లీ వాసులకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఆనందంగా పండగ చేసుకోవచ్చని ఢిల్లీ సీఎం కూడా ప్రకటించారు. కానీ, దివాలీ సెలబ్రేషన్‌తో వాయు నాణ్యత ఇంకాఇంకా క్షీణించి, అత్యంత ప్రమాదకర పరిస్థితికి చేరుకోవచ్చని బెంబేలెత్తుతున్నారు ఢిల్లీ జనం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
