Air Pollution: వామ్మో.. ఊపిరి పీల్చుకునేదెలా.. అక్కడుంటే రోజుకు 50 సిగరేట్లు తాగినట్లేనట!
Delhi Air Pollution: పెరుగుతున్న కాలుష్యానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆరోపిస్తూ, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు తగులబెట్టే సంఘటనలు నిరంతరం పెరుగుతున్నాయని అన్నారు.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయుకాలుష్యం కారణంగా పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఢిల్లీలో ఊపిరి పీల్చుకోవడం 49-50 సిగరెట్లు తాగడంతో సమానమట. అంటే 24 గంటల్లో ఒక వ్యక్తి రోజుకు 50 సిగరెట్లు తాగినంత గాలి కలుషితం అవుతోంది. ఢిల్లీలో కాలుష్యానికి క్రాకర్లు, ఇతర వాటిని కాల్చడం ప్రధాన కారణాలుగా పరిగణిస్తున్నారు. విషపూరితమైన గాలి కారణంగా ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కళ్లలో విపరీతమైన మంట వస్తుంది. సోమవారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 978కి చేరుకుంది. ఇది రోజుకు 50 సిగరెట్లు తాగడానికి సమానని ఢిల్లీ తర్వాత హర్యానాలో కాలుష్యం ఎక్కువగా ఉంది. హర్యానాలో AQI 631, ఇది రోజుకు 33 సిగరెట్లు తాగడానికి సమానంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏక్యూఐ 273, పంజాబ్‌లో 233గా ఉంది.
ఈ కాలుష్యాల వల్ల కాలక్రమేణా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతింటాయని, ఇది సాధారణంగా ధూమపానంతో సంబంధం ఉన్న దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందని, శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులకు కారణమవుతుందని తెలిపారు.
అటువంటి వాయు కాలుష్యానికి దీర్ఘకాలికంగా గురికావడం వల్ల నివాసితులు PM2.5, PM10, నైట్రోజన్ డయాక్సైడ్ (NO₂), సల్ఫర్ డయాక్సైడ్ (SO₂), ఓజోన్ (O₃) వంటి వాయువులు, విషపూరిత కాక్‌టెయిల్‌కు గురవుతారు. ఈ కాలుష్య కారకాలు వాహన ఉద్గారాలు, పారిశ్రామిక విడుదల, బయోమాస్ బర్నింగ్ వంటి మూలాల నుండి ఏర్పడుతున్నాయి.
కాలుష్యంపై రాజకీయాలు:
పెరుగుతున్న కాలుష్యానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆరోపిస్తూ, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు తగులబెట్టే సంఘటనలు నిరంతరం పెరుగుతున్నాయని అన్నారు. అనేక సందర్భాల్లో తగినంత వెంటిలేషన్ లేకుండా మూసివున్న ప్రదేశాలలో విషపదార్ధాలు పేరుకుపోవడం వల్ల బయటి కాలుష్యం కంటే ఇండోర్ కాలుష్యం ఎక్కువ హానికరం. అంతేకాకుండా, బహిరంగ కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు కిటికీలను మూసి ఉంచుతారు. ఇది కాలుష్య కారకాలను ఇంటి లోపలికి వ్యాపించే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి