పంట కోతకొచ్చిందని కోసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ సీన్‌ చూసి పరుగో పరుగు

పంట కోతకొచ్చిందని కోసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ సీన్‌ చూసి పరుగో పరుగు

Phani CH

|

Updated on: Nov 19, 2024 | 1:36 PM

సంక్రాంతి దగ్గరపడుతోంది.. పంటలు కోతకొచ్చే కాలం.. రైతులు ఆశలన్నీ చేతికొచ్చే పంటపైనే. ఈ నేపథ్యంలో ఆరుగాలం కష్టపడి సేద్యం చేసిన పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. ప్రతిరోజూ పొలానికి వెళ్లి పంటను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ రైతు రోజూలాగే తన పొలానికి వెళ్లాడు.

చేలో ఎలుకలు లాంటివేమైనా చొరబడ్డాఏమో.. పంటను నాశనం చేసేసాయేమోనని పరిశీలిస్తుండగా ఊహించని దృశ్యం అతనికి కనిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడిన రైతు అక్కడినుంచి పరుగందుకున్నాడు. గ్రామానికి వచ్చి అందరికీ విషయం చెప్పాడు. వారంతా అక్కడికి చేరుకుని అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. గ్రామంలో పంచాయితీ పెట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామంలో పంట పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు. పంటపొలంలో మనిషి ఆకారంలో బొమ్మను చిత్రించి, నిమ్మకాయలు పెట్టి, పసుపు కుంకుమలతో జిల్లేడు చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. గుమ్మడికాయలు, కొబ్బరికాయలతో క్షుద్ర పూజలు చేశారు. దీంతో అక్కడ ఎవరో చేతబడి చేశారని భావించిన చుట్టుపక్కల పొలాల్లోని రైతులు, కూలీలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న రైతు క్షుద్ర పూజలు ఎవరు చేశారో తెలుసుకునేందుకు గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

25 లక్షల కోట్ల ఆస్తా !! పుడితే ఇలాంటి ఫ్యామెలీలోనే పుట్టాలి

Mahesh Babu: లుక్కు మారింది.. ఇప్పుడు నిజంగా అదిరిపోయింది

Pushpa 02: పుష్ప2 ట్రైలర్‌పై యంగ్ డైరెక్టర్ల క్రేజీ పొగడ్తలు

Keerthy Suresh: చడీచప్పుడు కాకుండా కీర్తి పెళ్లి ?? గోవాలో వేడుక ??

Fatty Liver: ఫ్యాటీలివర్.. సైలెంట్ కిల్లర్ !!