Keerthy Suresh: చడీచప్పుడు కాకుండా కీర్తి పెళ్లి ?? గోవాలో వేడుక ??
సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ల ప్రేమలు, పెళ్లిళ్లకు సంబంధించిన వార్తలకు సోషల్ మీడియాలో కొదవే ఉండదు. ఇదిగో తోక అంటే అదిగో పులి అనేలా పరిస్థితితులు ఉంటాయి. పలానా హరోయిన్, పలానా వ్యక్తితో ప్రేమలో ఉందని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు రావడం వెరీ కామన్.
ఆ తర్వాత తీరిగ్గా.. తమ పెళ్లి వార్తలపై హీరోయిన్లు స్పందించడంతో.. క్లారిటీ ఇవ్వడంతో ఆ వదంతులు కాస్తా ఆగిపోతుంటాయి. అయితే ఈ మధ్య తన పెళ్లి న్యూస్‌తో.. ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉంటున్నారు అందాల తార కీర్తి సురేష్. ఇప్పుడు కూడా మరోసారి అదే న్యూస్‌తో నెట్టింట రచ్చ లేపుతున్నారు. కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి ఇప్పటి వరకు చాలాసార్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆమె ఖండిస్తూ వచ్చింది కూడా. మొన్నటికిమొన్న ఆమె మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దుబాయికి చెందిన ఓ వ్యాపారితో పెళ్లి ఖాయమైందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే వీటిపై కీర్తి సురేష్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. పైగా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సున్నితంగా తిరస్కరించింది. అయితే ఇప్పుడు తన చిరకాల మిత్రుడితో కీర్తి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరుకుటుంబాల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతోందని, గోవా బీచ్ లో పెళ్లి వేదికను ఫిక్స్ చేశారని బాలీవుడ్ మీడియా పెద్ద ఎత్తున కథనాలను పబ్లిష్ చేస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే.. కీర్తి సురేష్ రియాక్షన్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Fatty Liver: ఫ్యాటీలివర్.. సైలెంట్ కిల్లర్ !!
TOP 9 ET News: ఐకాన్ స్టార్ క్రేజ్ చూసి.. షాకైన బీహార్ ప్రభుత్వం
ఏకంగా పోలీస్ వాహనాన్నే ఢీకొన్న హీరోయిన్.. అట్లుంటది మనతోని డ్రైవింగ్ మరి !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

