గ్రేట్ !! రాశీ ఖన్నా సినిమాకు ప్రధాని మోదీ ప్రశంసలు..
గోద్రా రైలు దుర్ఘటన నేటికీ వివాదాస్పదంగానే మిగిలిపోయింది. 2002లో జరిగిన ఆ ఘటన తర్వాత గుజరాత్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఇప్పటికే చాలా డాక్యుమెంటరీలు వచ్చాయి. ఇప్పుడు ఇదే ఘటనపై బాలీవుడ్‌లో 'ది సబర్మతి రిపోర్ట్' సినిమా నవంబర్ 15న రిలీజైంది. ఇందులో 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే, టాలీవుడ్ హీరోయిన్ రాఖీ ఖన్నా, లీడ్ రోల్ చేశారు.
ధీరజ్ శర్మ దర్శకత్వం వహించారు. గోద్రా మారణకాండ జరిగినప్పుడు జరిగిన ఘటనను మీడియా ఎలా చిత్రీకరించిందనే ప్రధాన ఇతివృత్తంతో ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను తెరకెక్కించారు. అయితే తాజాగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఎస్ ! ది సబర్మతి రిపోర్ట్ సినిమాని ఉద్దేశించి ఒక నెటిజన్ పెట్టిన పోస్ట్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించారు నరేంద్ర మోదీ. కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయని.. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ.. మోదీ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. ఇక ప్రస్తుతం మోదీ చేసిన ఈ ట్వీటే.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాశీ ఖన్నా ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఆమెను నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos