ఏకంగా పోలీస్ వాహనాన్నే ఢీకొన్న హీరోయిన్.. అట్లుంటది మనతోని డ్రైవింగ్ మరి !!
ఆడాళ్ల డ్రైవింగ్ పై బోలెడన్ని మీమ్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. వాళ్ల డ్రైవింగ్ పై బోలెడన్ని జోకులు సోషల్ మీడియాలో పేలుతుంటాయి. అయితే అలాంటి జోక్ మీమ్స్‌లోకి ఇప్పుడెక్కింది, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వాణీ కపూర్. ఎట్ ప్రజెంట్ అబిల్ గులాల్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది వాణీ కపూర్.
అయితే ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం జైపూర్‌లో జరుగుతుండడంతో.. ఆ లోకేషన్ వెళ్లిన ఈమె.. సీన్‌లో భాగంగా.. స్కూటీ నడిపేందుకు జైపూర్ రోడ్లపై ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలోనే అదుపు తప్పి.. రోడ్డు పై పోలీస్ వాహనాన్ని ఢీకొట్టింది. అయితే ఈ ఇన్సిడెంట్‌లో వాణీ కపూర్‌కు ఎలాంటి గాయాలు కాకపోయినా.. పోలీస్ వెహికిల్ మాత్రకు మాత్రం కొద్దిగా డ్యామేజ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవడంతో.. ఇప్పుడు ఆమె డ్రైవింగ్ పై.. అందులోనూ ఆడాళ్ల డ్రైవింగ్ పై మరో సారి జోకులు పేలుతున్నాయి. ఎన్నో చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ వాణి కపూర్ న్యాచురల్ స్టార్ నానితో కలసి ఆహా కళ్యాణం సినిమాలో కనిపించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos