Viral: వాణ్ణి వదిలేస్తే.. నేను, నా భార్య ఆత్మహత్య చేసుకుంటాం.! వీడియో..
విశాఖపట్టణంలోని గాజువాకలోని గంట్యాడ దారుణం జరిగింది. తనను ప్రేమించడం లేదనే కారణంతో ఓ ప్రేమోన్మాది యువతిపై ఇనుప రాడ్‌తో తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన నీరజ్‌శర్మ.. స్థానికంగా ఉండే యువతిని గత కొంతకాలంగా ప్రేమించాలని వేధిస్తున్నాడు.
జమ్మూకశ్మీర్‌కు చెందిన నీరజ్‌శర్మ.. స్థానికంగా ఉండే యువతిని గత కొంతకాలంగా ప్రేమించాలని వేధిస్తున్నాడు. అయితే, ఆమె అతన్ని పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం చెందిన నీరజ్.. యువతిపై ఇనుప రాడ్‌తో దాడికి పాల్పడ్డాడు. దీంతో యువతి కేకలు వేయగా.. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితుడు భయంతో పారిపోయాడు. బాధితురాలని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి కిలోమీటర్ దూరంలోని పొదల్లో నీరజ్ బ్యాగును గుర్తించారు పోలీసులు. నిందితుడు పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పారిపోతూ మార్గమధ్యలో షర్టును మార్చి బ్యాగును పొదల్లో పడేసి పరార్ అయ్యాడు.
నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాలుగు బృందాలుగా నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మా కుటుంబానికి ప్రాణభయం ఉందని.. ప్రభుత్వం, హోంమంత్రి స్పందించాలని బాధితురాలి తండ్రి పాపారావు కోరుతున్నారు. గతంలో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చినా.. మార్పు రాలేదన్నారు. అలాగే వదిలేస్తే మళ్లీ దాడి చేయడానికి గ్యారంటీ లేదని.. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని పాపారావు కోరుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలను కూటమి సభ్యులు పరామర్శించారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

