స్పైసీ అంటూ కారం ఎక్కువగా తింటున్నారా.? 

Narender Vaitla

19 November 2024

కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే ప్రధాన సమస్య అల్సర్‌. దీర్థకాలంగా కారం ఎక్కువ ఉన్న ఫుడ్‌ తీసుకుంటే కడుపులో అల్సర్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

కారం ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా గ్యాస్‌, కడుపుబ్బరం వంటి జీర్ణకోశ సమస్యలకు సైతం ఇది దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక ఎర్ర మిర్చిని ఎక్కువగా తినడం వల్ల కొన్ని సందర్భాల్లో డయేరియా బారిన పడే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కారాన్ని మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

చర్మ సంబంధిత సమస్యలకు సైతం ఇది దారి తీస్తుందని అంటున్నారు. కారం ఎక్కువగా ఉండే ఫుడ్‌ తీసుకుంటే చర్మంలో తేమ తగ్గి, పొడిబారం మొదలవుతుంది. ఇది చర్మం సమస్యలకు దారి తీస్తుంది.

కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఫుడ్‌ తీసుకోవడం వల్ల పైల్స్‌ వచ్చే అవకావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా పైల్స్‌తో ఇబ్బంది పడేవారు కారంను తగ్గించాలి.

దీర్ఘకాలంగా మోతాదుకు మించి కారం తినే వారికి గుండె సమస్యలతో పాటు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.