Boy Skipping: వీడియో చూసి ఇన్‌స్పైర్ అయిన బాలుడు.. స్టంట్ చేయాలనుకుని అనంత లోకాలకు

|

Jun 24, 2022 | 5:47 PM

పదేళ్ల బాలుడు స్టంట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. స్కిప్పింగ్ తాడు మెడకు చుట్టుకొని ఊపిరాడక మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాలుడు చాలా రకాల స్టంట్ వీడియోలు చూసేవాడని.. అలాగే ఓ వీడియో చూసిన అతను ఒక గదిలోకి వెళ్లాడని పోలీసులు చెప్పారు.

Boy Skipping: వీడియో చూసి ఇన్‌స్పైర్ అయిన బాలుడు.. స్టంట్ చేయాలనుకుని అనంత లోకాలకు
Boy Skipping
Follow us on

Boy Skipping: అత్యుత్సాహం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. పిల్లలకు సరియైన అవగాహన లేక.. తోటివాళ్లు చేస్తున్నారని తానూ అనుకరించి మృత్యువాతపడుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన 10 ఏళ్ల బాలుడు ఓ వీడియోలో చూసిన స్టంట్‌ను అలాగే చేయాలనుకున్నాడు. ఆన్‌లైన్‌లో చూసిన స్టంట్‌ను పునఃసృష్టి చేయడానికి ప్రయత్నిస్తూ చివరకు ప్రాణాలు పొగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

ఈశాన్య ఢిల్లీలోని కకర్తార్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పదేళ్ల బాలుడు స్టంట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. స్కిప్పింగ్ తాడు మెడకు చుట్టుకొని ఊపిరాడక మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాలుడు చాలా రకాల స్టంట్ వీడియోలు చూసేవాడని.. అలాగే ఓ వీడియో చూసిన అతను ఒక గదిలోకి వెళ్లాడని పోలీసులు తెలిపారు. స్కిప్పింగ్ చేస్తూ.. స్టంట్ చేయడానికి ప్రయత్నించాడని.. స్కిప్పింగ్ తాడు అతని మెడకు చుట్టుకొని ఊపిరాడక స్పృహతప్పి పడిపోయాడని తెలిపారు. వెంటనే గమనించిన బాలుడి తల్లిబాలుడి తల్లి ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన జరిగిన సమయంలో బాలుడు, తల్లి వేర్వేరు గదుల్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. తమ ప్రాధమిక విచారణలో బాలుడి మరణం ప్రమాదవశాత్తూ జరిగిందని గుర్తించామని పోలీసులు తెలిపారు. ఎటువంటి కేసు నమోదు చేయబడలేదని.. CrPC సెక్షన్ 174 (అసహజ మరణం) కింద ఈ ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తు చేపట్టామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..