Uttarakhand: దెహ్రాదూన్ కి రానున్న మెట్రో సర్వీసులు, జోషిమఠ్ కోసం రూ. 1000 కోట్లు కేటాయింపు

|

Mar 16, 2023 | 10:36 AM

ఉత్తరాఖాండ్ లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లో 77, 407 కోట్ల రూపాయలు కేటాయించారు. ఉత్తరఖాండ్ ఆర్థిక శాఖ మంత్రి బుధవారం రోజున ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి సమక్షంలో ప్రవేశపెట్టారు.

Uttarakhand: దెహ్రాదూన్ కి రానున్న మెట్రో సర్వీసులు, జోషిమఠ్ కోసం రూ. 1000 కోట్లు కేటాయింపు
Joshimath
Follow us on

ఉత్తరాఖాండ్ లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లో 77, 407 కోట్ల రూపాయలు కేటాయించారు. ఉత్తరఖాండ్ ఆర్థిక శాఖ మంత్రి బుధవారం రోజున ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి సమక్షంలో ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కవగా స్టార్టప్ లు, స్వయం ఉపాధి, ప్రకృతి పరిరక్షణ, స్వావలంబన, సుపరిపాలన అంశాలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ మధ్య జోషిమఠ్ లోని భూమిపై పగుళ్లు రావడం, ఆ ప్రాంతం కుంగిపోతుందనే వార్తలు రావడం దేశవ్యాప్తంగా దుమారం లేపాయి. అయితే ప్రత్యేకంగా ఈ జోషిమఠ్ ప్రాంతలోని సహాయక పనుల కోసం , ఇతర జీవనాధార పరిసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు వెయ్యి కోట్లు కేటాయించింది.

అలాగే ఉత్తరఖాండ్ రాజధాని అయిన దెహ్రాదూన్ లో మెట్రో సర్వీసులు కోసం సుమారు 101 కోట్లు కేటాయించారు. చీఫ్ మినిస్టర్ స్వరోజ్ నగర్ యోజన కింద 40 కోట్లు కేటాయించారు. మంగళవారం రోజున అసెంబ్లీలో 2022-23 కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సర్వే రిపోర్టును ప్రవేశపెట్టింది. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, వివిధ విభాగాల పురోగతి అంశాలను ఇందులో పొందుపరిచారు. 2020-21 ఆర్థిక ఏడాదికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 185,761 లక్షలు అంచనా వేయగా..2021-22 కు రూ. 205,840 లక్షలు అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..