బ్రేకింగ్.. మాస్కోలో చైనా రక్షణ మంత్రితో రేపు రాజ్ నాథ్ సింగ్ భేటీ !

భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు రేగిన వేళ.. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రేపు మాస్కోలో చైనా రక్షణ శాఖ మంత్రితో భేటీ కానున్నారు. చైనాలోని..

  • Umakanth Rao
  • Publish Date - 8:30 pm, Tue, 23 June 20
బ్రేకింగ్.. మాస్కోలో చైనా రక్షణ మంత్రితో రేపు రాజ్ నాథ్ సింగ్ భేటీ !

భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు రేగిన వేళ.. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రేపు మాస్కోలో చైనా రక్షణ శాఖ మంత్రితో భేటీ కానున్నారు. చైనాలోని అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్నీ వెల్లడించింది. మాస్కోలో ‘డిఫెన్స్ పరేడ్’ కార్యక్రమంలో పాల్గొనాలని రష్యా ప్రభుత్వం రాజ్ నాథ్ సింగ్ ని ఆహ్వానించింది. ఈ పరేడ్ లో మన త్రివిధ దళాల సైనిక ప్రతినిధి బృందం కూడా పాల్గొన బోతోంది. కాగా -రాజ్ నాథ్, చైనా రక్షణ మంత్రితో భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.