ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు 288 మంది ప్రయాణికులు చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక 56 మంది తీవ్రంగా గాయపడ్డారరని మరో 747 మందికి స్వల్ప గాయాలైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రాత్రి 10 గంటల వరకు ఇంకా ఎంతమంది చనిపోయారనే విషయం తెలుస్తోందని పేర్కొ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న క్షతగాత్రులను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యలకు సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకున్నారు. మరోపైపు రైల్వే మంత్రిత్వ శాఖ రైలు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..