Car Accident: కారు కింద ఇరుక్కున్న డెడ్ బాడీ.. పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్.. కట్ చేస్తే..

హిట్ అండ్ రన్ ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. యాక్సిడెంట్ చేయడం.. అక్కడ నుంచి తప్పించుకునేందుకు ముందూ వెనకా చూడకుండా పారిపోవడం. అయితే కొన్ని సార్లు మృతదేహాలు కారు టైర్లకు, కింది...

Car Accident: కారు కింద ఇరుక్కున్న డెడ్ బాడీ.. పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్.. కట్ చేస్తే..
Car Hit And Run
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 07, 2023 | 7:18 PM

హిట్ అండ్ రన్ ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. యాక్సిడెంట్ చేయడం.. అక్కడ నుంచి తప్పించుకునేందుకు ముందూ వెనకా చూడకుండా పారిపోవడం. అయితే కొన్ని సార్లు మృతదేహాలు కారు టైర్లకు, కింది భాగంలో ఇరుక్కుంటున్నాయన్న సంగతి కూడా పట్టించుకోవడం లేదు. తెలిసినా.. పోలీసుల భయంతో ఆపకుండా వెళ్లిపోతున్నారు. ఢిల్లీలో ఓ యువతిని కారు దాదాపు 20 కిలోమీటర్లు లాక్కెళ్లిన ఘటనను మరవకముందే ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌ లో అలాంటి ఘటనే జరిగింది. మథురలో యుమునా ఎక్స్‌ప్రెస్‌ వే పై మంగళవారం ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తిని ఢీ కొట్టిన వాహనం.. ఆ మృతదేహాన్ని సుమారు పది కిలోమీటర్లు లాక్కెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. వాహనం నడుపుతున్న దిల్లీకి చెందిన వీరేంద్ర సింగ్‌ను అరెస్టు చేశారు. అయితే.. కారు కింద ఉన్న వ్యక్తి వేరే ప్రమాదంలో చనిపోయాడని.. కానీ, తన వాహనం కింద చిక్కుకున్నాడని వీరేంద్ర చెప్పడం గమనార్హం.

మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో యమునా ఎక్స్‌ప్రెస్‌ వే పై వీరేంద్రసింగ్ ఆగ్రా నుంచి నోయిడాకు వెళ్తుండగా.. మథుర సమీపంలోని టోల్ గేట్‌ వద్ద కారు కింద ఓ వ్యక్తి మృతదేహం ఇరుక్కుపోయి ఉందని అక్కడి సిబ్బంది గుర్తించారు. అప్పటికే మృతదేహం ఛిద్రమైంది. దట్టమైన పొగమంచులో దారి సరిగ్గా కనిపించని కారణంగా ఇతర ప్రమాదానికి గురైన వ్యక్తి తన కారు కింద చిక్కుకుపోయాడని పోలీసులకు చెప్పాడు. దీంతో వీరేంద్ర తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

వీరేంద్రను అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు. అతన్ని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. మృతుడు ఎవరు? ఎలా చనిపోయాడనేది గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలను చెక్ చేస్తున్నారు. త్వరలోనే పూర్తి సమాచారం తెలుసుకుంటామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే