12 నుంచి 18 ఏళ్లలోపు వయసున్న చిన్నారుల నోవావాక్స్ (NovaVax) టీకా అందుబాటులోకి వచ్చింది. బయో టెక్నాలజీ కంపెనీ తీసుకువచ్చిన ఈ వ్యాక్సిన్ ను కౌమారదశలో ఉన్న పిల్లల కోసం అత్యవసర టీకాగా వినియోగించవచ్చని తెలిపింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చింది. నోవావాక్స్ కొవిడ్ వ్యాక్సిన్ భారతదేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) కొవావాక్స్ (Covovax) బ్రాండ్ పేరుతో అభివృద్ధి చేయబడింది. దేశంలో అనుమతి పొందిన మొదటి ప్రోటీన్ ఆధారిత టీకా ఇదే కావడం గమనార్హం. తమ టీకాకు భారత్ఆమోదం తెలపడంపై నొవొవ్యాక్స్ సీఈఓ స్టాన్లె సీ ఎర్స్ హర్షం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ సురక్షితం, సమర్థవంతం అని తేలిన తర్వాతే డీసీజీఐ పరిమితులతో కూడిన అనుమతి ఇచ్చిందని ఆయన చెప్పారు. భారత్లో ప్రోటీన్ ఆధారిత టీకాను ఉత్పత్తి చేస్తున్నందుకు గర్వంగా ఉందని సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా అన్నారు.18 ఏళ్లు పైబడిన వారికి కొవొవ్యాక్స్ఇచ్చేందుకు గతేడాది డిసెంబర్లోనే డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
12-18 ఏజ్ గ్రూపునకు చెందిన 460 మందిపై తమ టీకా రోగనిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేసిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. గత నెలలో 12-17 సంవత్సరాల వయస్సున్న 2,247 మందిపై నోవావాక్స్ వ్యాక్సిన్ ను పరీక్షించారు. చివరి దశ ట్రయల్స్ లో ఈ వ్యాక్సిన్ కొవిడ్ కు వ్యతిరేకంగా 80శాతం ప్రభావవంతంగా పనిచేసినట్టు తేలినట్లు వెల్లడించింది. ఈ వయస్సు గ్రూపు వారికి అత్యవసర వినియోగానికి పొందిన నాల్గో టీకాగా నోవావాక్స్ నిలిచింది. అంతకు ముందు బయోలాజికల్ ఈ కంపెనీకి చెందిన కోర్బా వాక్స్, జైడస్ క్యాడిలాకు చెందిన జైకోవ్ డీ, భారత్ బయోటెక్ కొవాగ్జిన్ లు ఈ అనుమతులు పొందాయి.
Novovax’ COVID-19 vaccine gets emergency use authorisation for adolescents between 12-18 yrs in India
Read @ANI Story | https://t.co/6lTNg5gPU7#Novavax #covovax #SII #CovidVaccine #Covidvaccination pic.twitter.com/1W0I71mQl0
— ANI Digital (@ani_digital) March 23, 2022
Also Read